‘గతం గతః’ అంటున్న శ్రీముఖి..!

మొదటి నుండీ మంచి స్నేహితులుగా కొనసాగిన శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్.. ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే శత్రువులుగా మారిపోయారు. ‘బిగ్ బాస్ సీజన్ 3’ కు రాహుల్ విన్నర్ గా నిలువగా… శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఆరంభం నుండీ ‘శ్రీముఖి అనేక సార్లు రాహుల్ ను టార్గెట్ చేయడం వల్లే సింపతీ పెరిగి రాహుల్ విన్నర్ అవ్వడానికి కారణమయ్యింది’ అనే కామెంట్స్ కూడా వినిపించాయి. ‘ఇక జన్మలో నేను రాహుల్ తో మాట్లాడను’ అంటూ నంబర్స్ టాస్క్ లో శ్రీముఖి తెగేసి చెప్పేసింది కూడా..! అయితే ఇప్పుడు మాత్రం గతం గతః అంటుంది.

సడెన్ గా రాహుల్, శ్రీముఖి లు.. మళ్ళీ మంచి ఫ్రెండ్స్ అయిపోయి డ్యాన్స్ లు వేస్తుండడంతో అంతా షాక్ అవుతున్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవు అంటూ చెప్పుకొస్తున్నారు. తాజాగా వరుణ్ సందేశ్, వితికా, రాహుల్, శ్రీముఖి కలిసి ఓ పార్టీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్, శ్రీముఖి కలిసి ‘జిగేలు రాణి’ పాటకి స్టెప్పులు కూడా వేశారు. ఇందులో భాగంగా.. ఓ సెల్ఫీని తీసుకున్నారు. ఈ ఫోటోని శ్రీముఖి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… ‘గతం గతః.. అసలు రిలేషన్ షిప్ ఇప్పుడు మొదలైంది’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఏమైతేనేం మొత్తానికి వీరిద్దరూ మళ్ళీ కలిశారు కాబట్టి వీళ్ళ ఫ్యాన్స్ కూడా ఒకరిని ఒకరు ట్రోల్ చేసుకోవడం ఆపేస్తారు అని చెప్పడంలో సందేహం లేదు.


అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus