టాలీవుడ్‌లో కామెడీ టైమింగ్ కిర్రాక్ ఉన్న హీరోల్లో శ్రీవిష్ణు (Sree Vishnu) ఒకరు. ఆయన టైమింగ్‌కి ఫ్యాన్స్ అయిపోయి కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్ అనే ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చేశారు మన ప్రేక్షకులు. ఇప్పటివరకు ఆయన నుండి వచ్చిన సినిమాలు చాలా వరకు విజయం సాధించడం కూడా.. ఆయనకు ఆ ట్యాగ్‌లైన్ పెట్టడం కరెక్టే అనిపిస్తోంది. అయితే ఆయన కామెడీ టైమింగ్, తనదైన శైలి పంచ్‌లు సినిమాలోనే కాదు బయట కూడా ఉంటాయి. అప్పుడప్పుడు అవి అలా తళుక్కున మెరిసిపోతుంటాయి కూడా.
తాజాగా ఆయన నటించిన ‘కామ్రేడ్ కల్యాణ్’ సినిమా ప్రచార కార్యక్రమంలోనూ ఇలాంటి ఓ కామెంట్ వేసి.. నవ్వులు పూయించాడు. అంతేకాదు ఆ కామెంట్‌తో స్టేజీ మీద గత కొన్ని ఏళ్లుగా లేనిపోని శపథాలు చేస్తున్న వారికి కౌంటర్ కూడా ఇచ్చినట్లు అయింది. తెలుగు సినిమా ప్రచారంలో స్టేజీ శపథాలు కొత్తేమీ కాదు. ‘రాజాసాబ్’ సినిమా సమయంలో దర్శకుడు మారుతి ఇలాంటి పనే చేసి చాలా ఇబ్బందిపడ్డారు. మొన్నీ మధ్య ‘సహ’ సినిమా హీరోయిన్ కూడా అదే పని చేసింది. ఇవన్నీ గుర్తొచ్చాయో ఏమో.. ఇప్పుడు శ్రీవిష్ణు (Sree Vishnu) కౌంటర్ వేశాడు.
ఇంతకీ ఏమనన్నాడు అనేగా డౌట్. ‘కామ్రేడ్ కళ్యాణ్’ దర్శకుడు జానకీరామ్ మారెళ్లను ఉద్దేశిస్తూ.. ‘‘నువ్వు కంగారుపడకు. కంగారులో ఏవేవో వాగ్దానాలు చేయొద్దు. ‘అమీర్‌పేట్ సెంటర్లో బట్టలిప్పుతా..’ లాంటి మాటలు చెప్పకు’’ అని డైరెక్టర్‌కు శ్రీవిష్ణు (Sree Vishnu) అన్నాడు. దీంతో వేదికపై ఉన్నవారంతా నవ్వేశారు. ఆయన అక్కడ ఇతర నటులు/ దర్శకులు / సాంకేతిక నిపుణుల పేర్లు ప్రస్తావించలేదు కానీ.. పంచ్ అయితే అలాంటివారందరికీ అని అర్థమవుతోంది.
అవును.. ఆ హీరోయిన్ ఏమంది అనేగా డౌట్. ‘సహ’ సినిమా చూశాక ‘ఎంత మంచి సినిమా తీశారు’ అని అందరూ అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఈ సినిమా చూసి నిరాశపడితే నేను అమీర్‌పేట్ సెంటర్‌లో నిలబడి గుండు కొట్టించుకుంటా అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సినిమా విజయం సాధించలేదు అనుకోండి. ఇక శపథం సంగతా మనకెందుకు వదిలేయండి.