శ్రీ విష్ణు హీరోగా నటించిన రాజ రాజ చోర ఆగష్టు నెలలో థియేటర్లలో విడుదలై హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. నిన్నటినుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న రాజ రాజ చోర ఓటీటీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. కథ, కథనం కొత్తగా ఉండటంతో పాటు తొలి సన్నివేశం నుంచి క్లైమాక్స్ వరకు కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు ఉండటంతో ఓటీటీ ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పాజిటివ్ గా అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
శ్రీవిష్ణు నటనతో తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగా కామెడీ విలన్ టైపు పాత్రలో రవిబాబు ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో మేఘా ఆకాష్ తెలుగులో తొలి సక్సెస్ ను ఖాతాలో వేసుకోగా అందం, ప్రతిభతో మెప్పించి మరో హీరోయిన్ సునైనా మంచి మార్కులు కొట్టేశారు. కథను మలుపు తిప్పే అంజమ్మ పాత్రలో గంగవ్వ నటించారు. రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ సినిమాలో ఏ సన్నివేశం కూడా బోర్ కొట్టదు.
థియేటర్లలో హిట్ అనిపించుకున్న రాజ రాజ చోర ఓటీటీలో బ్లాక్ బస్టర్ గా నిలవడం గమనార్హం. ఆసక్తికరమైన ట్విస్టులు రాజ రాజ చోర సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయి. ఫస్టాఫ్ కు కామెడీ హైలెట్ గా నిలవగా సెకండాఫ్ లో డ్రామా, మెసేజ్ కు సంబంధించిన సీన్లు ఉండేలా దర్శకుడు కథనాన్ని రాసుకున్నాడు. శ్రీవిష్ణు సినిమాలో చోరుడి పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ వీకెండ్ ఓటీటీలో మంచి సినిమాను చూడాలని భావించే వాళ్లకు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న రాజ రాజ చోర బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు