Sreeleela: అనన్య వదిలేసింది.. శ్రీలీల పట్టేసింది.. బాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్!

ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోయిన డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల జోరు ఇప్పుడు ఇక్కడ కాస్త తగ్గింది. రీసెంట్ గా వచ్చిన ‘మాస్ జాతర’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం, తెలుగులో పెద్ద ఆఫర్లు రాకపోవడంతో అమ్మడు తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీద పెట్టింది. అయితే అదృష్టం తలుపు తట్టాలే కానీ, అవకాశం ఎక్కడి నుంచైనా వస్తుందనడానికి శ్రీలీల లేటెస్ట్ అప్డేట్ ఉదాహరణగా నిలుస్తోంది.

Sreeleela

బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న బ్యానర్ ‘మ్యాడాక్ ఫిలింస్’. స్త్రీ 2, ముంజ్య లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ సంస్థ త్వరలో ‘చూమంతర్’ అనే ఫాంటసీ రొమాంటిక్ డ్రామాను ప్లాన్ చేసింది. ఇందులో హీరోయిన్ గా అనన్య పాండేను అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేక ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె వదిలేసిన ఆ గోల్డెన్ ఛాన్స్ మన శ్రీలీల తలుపు తట్టింది.

నిజానికి అనన్య పాండే తన వెబ్ సిరీస్ ‘ కాల్ మీ బే 2’ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాను వదులుకుందట. దీంతో మేకర్స్ చూపు శ్రీలీల మీద పడింది. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపారట. ఆమెతో పాటు జానకి బోడివాలా పేరు కూడా పరిశీలనలో ఉన్నా, బాలీవుడ్ సర్కిల్స్ లో శ్రీలీల వైపే మొగ్గు ఎక్కువగా ఉంది. ఇంకా ఆమె నటించిన మొదటి హిందీ సినిమా రిలీజ్ కాకముందే అక్కడ అమ్మడికి ఫుల్ క్రేజ్ వచ్చేసింది.

ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ తో అనురాగ్ బాసు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న శ్రీలీల, మరోవైపు ఒక స్పెషల్ డ్యాన్స్ నంబర్ కోసం కూడా చర్చలు జరుపుతోంది. ఇప్పుడు ఈ ‘చూమంతర్’ ఆఫర్ కూడా ఓకే అయితే, శ్రీలీల బాలీవుడ్ జర్నీకి గట్టి పునాది పడినట్లే. తెలుగులో గ్యాప్ వచ్చినా, హిందీలో మాత్రం బిజీ అయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus