Sreeleela Remuneration: శ్రీలీల పారితోషికం అప్పుడే అంతకు పాకిందా..!

  • February 1, 2022 / 03:05 PM IST

టాలీవుడ్లో హీరోయిన్ల కొరత చాలా ఉంది. ప్రతీసారి రష్మిక, పూజా హెగ్డే లే హీరోయిన్లు అంటే కుర్రకారు మొహం చాటేస్తున్నారు. ఇలాంటి టైములో ఇద్దరు కొత్త భామలు వచ్చి రాజ్యం ఏలేస్తున్నారు. వాళ్ళే కృతిశెట్టి, శ్రీలీల. ‘ఉప్పెన’ తో కృతి శెట్టి బ్లాక్ బస్టర్ కొట్టి సెటిల్ అయిపోయింది. అటు తర్వాత ఆమె నటించిన రెండు సినిమాలు కూడా హిట్ అవ్వడంతో ప్రస్తుతం వచ్చే సినిమాకి రూ.1కోటి డిమాండ్ చేసే స్థాయికి వెళ్ళింది.

కృతి శెట్టి అయినా 3 సినిమాల తర్వాత ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చే సినిమాలకి డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. అయితే శ్రీలీల.. తన రెండో సినిమా ఇంకా విడుదల కాకుండానే భారీ పారితోషికం డిమాండ్ చేయడం మొదలుపెట్టేసింది. నిజానికి ఆమె మొదటి చిత్రం ‘పెళ్ళి సందD’కి మొదట ప్లాప్ టాకే వచ్చింది. కానీ శ్రీలీల లుక్స్, ఆమె స్కిన్ షో కుర్ర కారుని థియేటర్ కు తీసుకు రాగలిగాయి. అందుకే ఆ సినిమా రూ.8కోట్ల వరకు వసూళ్ళని సాధించగలిగింది.

అందుకే తన రెండో చిత్రానికి రూ.40 లక్షలు డిమాండ్ చేయగా మేకర్స్ వెంటనే ఓకె చెప్పేసారు. ఆమె రెండో చిత్రం నవీన్ పోలిశెట్టితో చేస్తుంది. దాంతో పాటు ఆమె మూడో చిత్రానికి ఏకంగా రూ.1 కోట్లు డిమాండ్ చేసిందట. మూడో చిత్రానికే ఇంతా? అని దర్శకనిర్మాతలు నోళ్ళు వెళ్లబెట్టినప్పటికీ రూ.75 లక్షల వరకు ఓకె చెప్పేసారట. ఫైనల్ గా ఈమె క్యార్ వ్యాన్ అండ్ టీం కు పెట్టె ఖర్చులు అన్నీ కలిపి రూ.1 కోటి దాటేసే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. ఆమె ఓకె చేసిన సినిమాలు కూడా హిట్ అయితే ఈ అమ్మడిని కంట్రోల్ చేయడం కష్టమే..!

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus