Sreeleela: శ్రీలీలా చేసే పని తెలిస్తే అభిమానులు తట్టుకోలేరు!

యంగ్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉంది అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఇక రాఘవేంద్రరావు చేతిలో పడితే ఏ హీరోయిన్ లైనా స్టార్ హీరోయిన్ అవ్వాల్సిందే అనడంలో మరొకసారి ప్రూవ్ అయింది.

అలాగే ఆ తర్వాత రవితేజ వంటి సీనియర్ హీరో సరసన ధమాకా సినిమాలో నటించి రవితేజ నీ మించిన తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ హీరోతో సినిమాలో నటించినప్పుడు చాలామంది శ్రీలీలా ఇలా సీనియర్ హీరోలతో నటిస్తే ఆమెకు అవకాశాలు రావు అని భావించారు. కానీ దానికి వ్యతిరేకంగా ఈమెకు చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.ఈ విషయాలన్నీ పక్కన పెడితే శ్రీ లీల తన తల్లి కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అంటూ ప్రస్తుతం ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే ఇప్పటినుండి శ్రీ లీల (Sreeleela) తాను చేయబోయే సినిమాల్లో ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో కానీ ఇంటిమేట్ సన్నివేశాల్లో కానీ నటించకూడదు అని నిర్ణయించుకుందట. ఎందుకంటే ఆమె అలాంటి సన్నివేశాల్లో నటిస్తే చాలామంది నెటిజన్స్ ఆమెని ట్రోల్ చేస్తున్నారని శ్రీలీలా తల్లి బాధపడుతుందట. అంతేకాదు చిన్న వయసులోనే ఇలా సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురైతే ఆమె కెరియర్ కొనసాగుతున్న కొద్దీ మరిన్ని ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని,అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించకూడదని శ్రీలీలా తల్లి తనకు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు కొంతమంది నెటిజన్స్ అయితే ఏకంగా నీ తల్లి క్యారెక్టర్ అలాంటిదే నువ్వు కూడా అలాగే తయారవుతున్నావా అంటూ చాలా నీచంగా కామెంట్లు పెడుతున్నారట. అందుకే ఇలాంటి కామెంట్లు తనపై రాకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటినుండి శ్రీల అలాంటి సన్నివేశాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకుందట.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus