Sreeleela: శ్రీలీల టైం ఆయేగా
- February 20, 2026 / 05:50 PM ISTByPhani Kumar
‘ధమాకా’ తర్వాత హీరోయిన్ గా శ్రీలీల(Sreeleela) ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు. బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ హిట్ అయినా.. అందులో శ్రీలీల హీరోయిన్ కాదు. అయినప్పటికీ దాని సక్సెస్ క్రెడిట్ శ్రీలీల ఖాతాలో పడలేదు.’స్కంద’ ‘ఆదికేశవ’ ‘ఎక్స్ట్రా ఆర్డియనరీ మెన్’ ‘గుంటూరు కారం’ ‘రాబిన్ హుడ్’ ‘జూనియర్’ ‘మాస్ జాతర’ ‘పరాశక్తి’ ఇలా అన్నీ డిజాస్టర్లే. వేరే హీరోయిన్ ట్రాక్ రికార్డు ఇలా ఉంటే.. ఈపాటికి దుకాణం సర్దేసేది.
Sreeleela
కానీ శ్రీలీల ఆ విషయంలో లక్కీ అనే చెప్పాలి. ఇన్ని డిజాస్టర్లు పడినప్పటికీ.. ఆమె డిమాండ్ ఏమీ తగ్గలేదు. ఇప్పటికీ ఆమె కోటి రూపాయలు పారితోషికం అందుకుంటుంది. ప్రస్తుతం ఆమె హిందీలో 2 సినిమాల్లో నటిస్తుంది.అవి రెండూ క్రేజీ ప్రాజెక్టులే. మరోవైపు తమిళంలో క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. ధనుష్ 50వ సినిమాలో సాయి పల్లవితో పాటు మరో హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.మరోవైపు పవన్ కళ్యాణ్ కి జోడీగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటించింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా అది. మార్చి 26న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించి శ్రీలీల తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం కూడా పూర్తయ్యింది.
ఈ ఒక్క సినిమా హిట్ అయితే.. శ్రీలీల ఫ్లాప్స్ నుండి బయటపడినట్టే. దర్శకుడు హరీష్ శంకర్ కి కూడా ఫ్లాప్స్ లో ఉన్న హీరోయిన్స్ ని బయటపడేసిన ట్రాక్ రికార్డ్ ఉంది. సో శ్రీలీలకి గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్టే…!
















