Sreeleela: వాళ్లను చూసే టికెట్లు కొంటున్నారు.. శ్రీలీల కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ గా శ్రీలీలకు పేరుంది. ఎనిమిది కంటే ఎక్కువ సినిమాలలో ప్రస్తుతం ఆమె నటిస్తున్నారని తెలుస్తోంది. రాబోయే మూడేళ్లలో బాక్సాఫీస్ వద్ద శ్రీలీల డామినేషన్ స్పష్టంగా కనిపించనుంది. అయితే శ్రీలీల తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఆడియన్స్ సినిమా విడుదలయ్యాక మొదటిరోజు టికెట్లను హీరోల కోసం కొంటున్నారని శ్రీలీల అన్నారు. నేను సినిమా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చానని ఆమె తెలిపారు.

సినిమాలో నాకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండాలని సినిమా అంతా నేనే కనిపించాలని కోరుకోనని శ్రీలీల చెప్పుకొచ్చారు. మంచి రోల్ అయితే చాలని ప్రేక్షకులకు గుర్తుండిపోయే రోల్స్ లో నటించాలని భావిస్తున్నానని ఆమె అన్నారు. ఒక్కరోజు కూడా ప్రస్తుతం ఖాళీగా లేనని ఆమె కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి మూవీలో విభిన్నమైన రోల్ లో కనిపించాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ కానున్నానని శ్రీలీల (Sreeleela) అభిప్రాయం వ్యక్తం చేశారు. సెట్స్, షూటింగ్ లో ఎక్కువ సమయం బిజీగా ఉన్నానని ఆమె కామెంట్లు చేశారు. నా వర్క్ ను ఎంజాయ్ చేస్తున్నానని కెమెరా ముందు ఉండటం నాకు వ్యసనంగా మారిపోయిందని శ్రీలీల తెలిపారు. అమ్మ డాక్టర్ కావడంతో నేను కూడా డాక్టర్ కావాలని అనుకుంటున్నానని ఆమె కామెంట్లు చేశారు.

ఏ విషయంలో అయినా ఇంట్లో వాళ్లు నాపై ఒత్తిడి చేయరని శ్రీలీల పేర్కొన్నారు. త్వరలోనే చదువు, సినిమాలు బ్యాలెన్స్ చేసుకుంటానని ఆమె వెల్లడించారు. శ్రీలీల రెమ్యునరేషన్ కోటి రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం. శ్రీలీల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుసగా రెండు విజయాలను ఖాతాలో వేసుకున్న శ్రీలీల భవిష్యత్తులో కూడా వరుస సక్సెస్ లను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus