Sreeleela: శ్రీలీలవి మామూలు తెలివి తేటలు కాదండోయ్..!

  • October 14, 2023 / 01:26 PM IST

శ్రీలీల..అతి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ‘పెళ్లిసందD’ అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించింది. అటు తర్వాత వచ్చిన ‘ధమాకా’ విషయంలోనూ అదే జరిగింది. ఆ రెండు సినిమాల సక్సెస్ విషయంలోనూ శ్రీలీల హస్తం ఉంది. ఆ తర్వాత ‘స్కంద’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వచ్చేవారం ‘భగవంత్ కేసరి’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీలీల కూతురి పాత్రలో కనిపించబోతుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం ఆమె నిన్న మీడియా ముందుకు వచ్చింది. వచ్చి రాగానే ఆమె మీడియాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ‘దయచేసి ఇప్పుడు కేవలం ‘భగవంత్ కేసరి’ గురించి మాత్రమే అడగండి’ అని అనేసింది. దాని వెనుక కారణం ఏంటో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. శ్రీలీల గత చిత్రం ‘స్కంద’ కి నెగిటివ్ టాక్ వచ్చింది.

కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. పైగా అందులో ఆమె పాత్రకి కూడా పెద్దగా ప్రాముఖ్యత అంటూ ఉంటుంది. ఇది ఒక కారణమైతే.. శ్రీలీల ‘గుంటూరు కారం’ సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా గురించైతే చిత్ర బృందం ఏదీ కన్ఫర్మ్ చేయడం లేదు. శ్రీలీల మెయిన్ హీరోయిన్ అని కూడా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాల గురించి ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయో అని భావించి (Sreeleela) శ్రీలీల ముందుగానే ఆ మాట అనేసింది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus