Sreeleela: శ్రీలీల రేంజ్ ను పెంచే లైనప్.. అన్ని భాషల్లో బిజీబిజీగా..!

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంతో త్వరగా స్టార్ హోదాకు చేరుకున్న శ్రీలీల(Sreeleela) , ఇప్పుడు తన కెరీర్‌ను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తోంది. తెలుగులో వరుస బిగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్‌లపై కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే టాప్ హీరోలతో కలిసి పనిచేస్తున్న శ్రీలీల, తన మార్కెట్‌ను మరింత పెంచుకునేలా స్ట్రాంగ్ లైనప్‌ను సిద్ధం చేసుకుంటోంది. తెలుగులో టాప్ హీరోల సరసన నటిస్తున్న శ్రీలీల, 2025లో మరిన్ని భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sreeleela

ఆమె ప్రస్తుతం 2 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటూ, మరింత హైప్ సాధిస్తోంది. టాలీవుడ్‌లో ధమాకా (Dhamaka) మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన శ్రీలీల, ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) సరసన ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం దక్కినట్లు సమాచారం. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌లో మరో హిందీ సినిమా చర్చల్లో ఉందని తెలుస్తోంది. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్‌లోనూ శ్రీలీల తన అందం, టాలెంట్‌తో ఎంట్రీ ఇవ్వనుంది.

తమిళంలో శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా తెరకెక్కనున్న ఒక సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల ఎంపిక అయినట్లు సమాచారం. ఇప్పటికే శ్రీలీల తమిళ యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నేపథ్యంలో, ఈ సినిమా ఆమెకు కోలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇవ్వనుందనే అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కలిసి శ్రీలీలను మరో లెవెల్‌కి తీసుకెళ్లే అవకాశముంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న శ్రీలీల, ఈ కొత్త ప్రాజెక్ట్స్‌ ద్వారా తన మార్కెట్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది.

ఒకవేళ ఈ సినిమాలు హిట్స్ అయితే, ఆమె రెమ్యూనరేషన్ 5 కోట్ల మార్క్‌ను దాటడం ఖాయమని టాక్. ఇదంతా చూస్తుంటే, 2025 శ్రీలీల కెరీర్‌లో ఓ స్పెషల్ ఇయర్‌గా నిలవనుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ, నేషనల్ లెవల్ స్టార్‌గా ఎదగాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. మరి ఈ సినిమాలు ఆమె రేంజ్‌ను ఎంతవరకు పెంచుతాయో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus