Sreemukhi: ఆ విషయంలో బుల్లితెర రాములమ్మ చేసిన పని తెలిస్తే నవ్వు అగదు!

  • June 22, 2023 / 04:17 PM IST

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలి అన్నా.. అవకాశాలు దక్కించుకోవాలి అన్న క్యాస్టింగ్ కౌచ్ కి బలి అవ్వాల్సిందే అన్న సంగతి అందరికీ తెలిసిందే . ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో టాప్ మోస్ట్ హీరోయిన్లుగా రాజ్యం ఏలేస్తున్న అందాల ముద్దుగుమ్మలు కూడా ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ కి బలి అయ్యారు. ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లే ఆ విషయాన్ని స్వయంగా ఒప్పుకుంటున్నారు.

అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారాలి అనుకున్న వ్యక్తులే కాదు ఇండస్ట్రీలో అరా కొరా పాత్రలు చేస్తున్న ముద్దుగుమ్మలకు సైతం క్యాస్టింగ్ కౌచ్ బాధలు ఎదురయ్యాయి అని చాలామంది నటులు చెప్పుకొచ్చారు . ఇలాంటి క్రమంలోనే శ్రీముఖికి ఎదురైన ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి పలు సినిమాల్లో కూడా నటించింది అన్న విషయం అందరికీ తెలిసిందే .

కాగా ఇలాంటి క్రమంలోనే కెరియర్ స్టార్టింగ్ లో శ్రీముఖిని సినిమాలో ఆఫర్ కోసం ఓ స్టార్ట్ డైరెక్టర్ ఆడిషన్ కోసం రూమ్ కి పిలిచారట. అయితే ఆ డైరెక్టర్ బిజీ షెడ్యూల్ కావడంతో మార్నింగ్ అంతా షూటింగ్లో పాల్గొని టైం లేక నైట్ ఆ రోల్ కోసం చేసే అమ్మాయిలను ఆడిషన్ కోసం తన రూమ్ కి రమ్మన్నారట .

అయితే మొదటి నుంచి చాలా ముందు జాగ్రత్త ఉన్న (Sreemukhi) శ్రీముఖి బహుశా డైరెక్టర్ క్యాస్టింగ్ కౌచ్ కోసమే తన నైట్ రూమ్ కి రమ్మన్నాడేమో అని భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంట్లోనే రూమ్లో లాక్ చేసుకుని పడుకునేసిందట .రెండు మూడు రోజుల వరకు బయటకే రాలేదట.. తీరా తర్వాత ఆ పాత్రకు వేరే బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నారు అని తెలిసి..ఆ తర్వాత మేటర్ అమ్మడుకు అర్థమయి మంచి ఛాన్స్ అయిపోయాయి అంటూ వెక్కి వెక్కి ఏడ్చిందట.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus