నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ని ప్రేమలో దించడానికి మహాతల్లి ప్రయత్నించింది. అతను పని చేయకుండా తన మాటలతో తికమక చేసింది. మొత్తానికి శ్రీనికి అద్భుతమైన స్టోరీ లైన్ ని తెలియకుండా అందించింది. ఏంటి నిజమేనా? అని అనుకుంటున్నారా? ఆగండి.. ఆగండి.. ఇదంతా ఈ వారం మహాతల్లి అప్లోడ్ చేసిన క్యూట్ ఫిలిం “శ్రీ అచ్యుతానంద” లో జరిగిన స్టోరీ.
ప్రతి బుధవారం బుజ్జి చిత్రాలతో బొజ్జ నిండా నవ్వుకునేలా చేసే జాహ్నవి ఈ సారి అవసరాల శ్రీనివాస్ తో కలిసి అలరించింది. అచ్యుతి, ఆనందిలుగా మారి స్వీట్ లవ్ స్టోరీని యూట్యూబ్ తెరపైన చూపించింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని చెబితే మజా రాదు. చూడాల్సిందే. ఈ వీడియోని మీరూ ఓసారి లుక్ వేయండి.