Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ‘రాజా విక్రమార్క’లో యాక్షన్, సిట్యువేషనల్ కామెడీ… రెండూ ఉంటాయి!: దర్శకుడు శ్రీ సరిపల్లి ఇంటర్వ్యూ

‘రాజా విక్రమార్క’లో యాక్షన్, సిట్యువేషనల్ కామెడీ… రెండూ ఉంటాయి!: దర్శకుడు శ్రీ సరిపల్లి ఇంటర్వ్యూ

  • November 10, 2021 / 10:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రాజా విక్రమార్క’లో యాక్షన్, సిట్యువేషనల్ కామెడీ… రెండూ ఉంటాయి!: దర్శకుడు శ్రీ సరిపల్లి ఇంటర్వ్యూ

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కనిపించన్నారు. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ సరిపల్లితో ఇంటర్వ్యూ…

ప్రశ్న: శ్రీ సారిపల్లిగారూ… మీ గురించి చెప్పండి?

మాది విజయవాడ. పుట్టిందీ, పెరిగిందీ అక్కడే. విజయవాడలో 22 ఏళ్లు ఉన్నాను. తర్వాత అమెరికా వెళ్లాను. యూనివర్సల్ స్టూడియోస్ లో మాస్టర్ ఆఫ్ ఫిలిం మేకింగ్ చేశా. నాలుగేళ్లు అక్కడి ఇండిపెండెంట్ సినిమాలకు పని చేశా. తర్వాత ఇండియా వచ్చి వీవీ వినాయక్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో జాయినయ్యా. మా బంధువు ఒకాయనకి థియేటర్ ఉంది. ఆయనకు వినాయక్ గారు తెలుసు. అలా వెళ్లి కలిశా. ‘నాయక్’, ‘అల్లుడు శీను’ తదితర సినిమాలకు పని చేశా. ఇప్పుడు ‘రాజా విక్రమార్క’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాను.

ప్రశ్న: ‘రాజా విక్రమార్క’ కథేంటి?

ఎన్ఐఏలో కొత్తగా జాయిన్ అయిన యువకుడిగా కార్తికేయ కనిపిస్తారు. క్రమశిక్షణ లేకపోవడం వలన ఎలా ఇబ్బంది పడ్డాడు? ఓ వెపన్ డీలర్ దగ్గర సగం ఇన్ఫర్మేషన్ తీసుకుని చంపేస్తాడు. మిగతా ఇన్ఫర్మేషన్ సంగతేంటి? ఏమైంది? అనేది సినిమా. ఎంటర్టైన్మెంట్, యాక్షన్… అన్నీ ఉంటాయి. యాక్షన్ అంటే ఇరవైమందిని కొట్టడం టైప్ కాకుండా కొత్తగా, కథలో భాగంగా ఉంటుంది. ‘మిషన్ ఇంపాజిబుల్’ స్ఫూర్తిగా తీశా.

ప్రశ్న: ఎన్ఐఏ నేపథ్యంలో సినిమా అంటే యాక్షన్ ఎక్కువ ఉంటుంది. అందులో కామెడీ ట్రాక్ రాయడానికి భయపడ్డారా?

బేసిగ్గా… హ్యూమర్ ఫ్యాక్టర్ ఉండేలా చూసుకున్నాను. నేను సిబిఐ కాలనీ పక్కన ఉండేవాడిని. కిటికీలోంచి చూస్తే ఓ కుర్రాడు కనిపించేవాడు. నేను అతను డ్రైవర్ లేదా చిన్న పోస్టులో పనిచేసే వ్యక్తి అయ్యి ఉంటాడని అనుకున్నాను. తర్వాత ఆయన జేడీ లక్ష్మీనారాయణగారి బృందంలో కీలక సభ్యుడు అని తెలిసింది. నేను అనుకున్నట్టు చాలామంది అనుకుని ఉంటారు కదా! ఆ కోణంలో సన్నివేశాలు రాశా. కామెడీ అంటే సిట్యువేషనల్ కామెడీ ఉంటుంది. క్యారెక్టర్లు జోకులు వేయవు. ఆ సందర్భాలు చూస్తే ప్రేక్షకులకు నవ్వు వస్తుంది.

ప్రశ్న: కరోనా టైమ్ లో సెకండాఫ్ మార్చారని…

అలా ఏమీ చేయలేదండీ. కథలో కొంచెం బెటర్ మెంట్ చేశాం.

ప్రశ్న: కథ రాసేటప్పుడు కార్తికేయను హీరోగా అనుకున్నారా?

యంగ్ హీరో ఎవరినైనా తీసుకుంటే బావుంటుందని అనుకున్నాను. రెండు మూడు ప్రయత్నాలు చేశా. ‘ఆర్ఎక్స్ 100’ టైమ్ లో కార్తికేయను చూశా. లుక్ సెట్ అవుతుందని అనుకున్నాను. తర్వాత మేం అనుకున్న క్యారెక్టర్ లో ఉన్న టైమింగ్ అతనిలో ఉందని తెలిసింది. కథ చెప్పాను. తనకి నచ్చింది. ముందు కార్తికేయ ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాడు. క్రియేటివ్ గా, కమర్షియల్ గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కరోనా వల్ల సినిమా ఆలస్యమైంది. సినిమా తీయడానికి రెండేళ్లు పట్టినా… షూటింగ్ చేసింది 70 రోజులే.

ప్రశ్న: సెకండాఫ్ 36 గంటల్లో జరుగుతుందని విన్నాం!

అవునండీ! సెకండాఫ్ 36 గంటల్లో జరుగుతుంది. రేసీగా ఉంటుంది.

ప్రశ్న: ‘ఆర్ఎక్స్ 100’ టైమ్ అంటే… మీరు కథ రాసినప్పుడు ఎన్ఐఏ నేపథ్యంలో ఎక్కువ కథలు రాలేదు. తర్వాత వచ్చాయి కదా!

అవును. అయితే, ఆయా సినిమాల్లో చూపించిన పెద్ద పెద్ద సమస్యలు నేను చూపించలేదు. చాలా సింపుల్ గా ఉంటుంది. అలాగని, ఏదో చెవిలో పువ్వు పెట్టినట్టు ఏమీ చేయలేదు. ఎన్ఐఏ ఏజెంట్లు తీవ్రవాదులు మీద మాత్రమే కాదు, లోకల్ గానూ వర్క్ చేస్తారు. మా సినిమాలో దేశంలో సమస్య మీద ఎన్ఐఏ పోరాడుతుంది.

ప్రశ్న: ‘రాజా విక్రమార్క’ కంటే ముందు వేరే టైటిల్ అనుకున్నారట!

మా దగ్గర ఉన్న టైటిళ్లలో ఇదే బెస్ట్ ఆప్షన్. అందులో నో డౌట్. చిరంజీవిగారి టైటిల్ పెట్టాలని అనుకోవడం కాదు కదా! దానికి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండాలి కదా! అందుకని, ఆలోచించా. హీరో క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ కు ‘రాజా విక్రమార్క’ సూటవుతుందని పెట్టేశాం.

ప్రశ్న: తాన్యా రవిచంద్రన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

హోమ్ మినిస్టర్ కుమార్తెగా కనిపిస్తారు. క్లాసికల్ డాన్సర్ కూడా! ఇండిపెండెంట్ అమ్మాయిలా ఉంటుంది. రియల్ లైఫ్ లో ఆమె క్లాసికల్ డాన్సర్. పశుపతి, తనికెళ్ల భరణి, సాయి కుమార్, సుధాకర్ కోమాకుల… ప్రతి ఒక్కరి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది.

ప్రశ్న: ప్రశాంత్ ఆర్. విహారిని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకోవడానికి కారణం?

న్యూ ఏజ్ మ్యూజిక్ కోసమే! ఆయన ఇప్పటివరకూ ఇటువంటి జానర్ సినిమా చేయలేదు. అందుకని, అడిగా… ఈ జానర్ కు సెట్ అయ్యేలా చేస్తారా? అని! ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. రీ రికార్డింగ్ కూడా బాగా చేశారు.

ప్రశ్న: వ్యక్తిగతంగా మీరు ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు?

ఏ జానర్ సినిమా చేసినా… అందులో ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకుంటాను. నెక్ట్ సినిమా స్క్రిప్ట్ రెడీగా ఉంది. లాక్ డౌన్ లో రాశా.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kartikeya
  • #Raja Vikramarka
  • #Sri Saripalli
  • #Sri Saripally
  • #Tanya Ravichandran

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

10 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

10 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

1 day ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

1 day ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago

latest news

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago
CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

3 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

3 days ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

3 days ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version