శ్రీదేవి కూతురు డెబ్యూ ఫిలిమ్ ఫైనల్ అయ్యింది!

శ్రీదేవిని కథానాయికగా పరిచయం చేయడానికి కె.రాఘవేంద్రరావుగారు కూడా ఈరేంజ్ లో పరిశోధన చేసి ఉండరు అనిపిస్తుంది ఆమె తనయ జాన్వి వెండితెర తెరంగేట్రం కోసం జరుగుతున్నా హడావుడి చూస్తుంటే. విషయం ఏంటంటే.. ప్రస్తుతం బాలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ కూడా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్న ఏకైక విషయం “అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వి కపూర్” వెండితెర తెరంగేట్రం చేస్తుంది అని. తొలుత తెలుగులో రామ్ చరణ్ సరసన అని, అఖిల్ కి జోడీగా అని వార్తలొచ్చినప్పటికీ.. బాలీవుడ్ మీడియాకి శ్రీదేవి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో “నా కూతురు ఓ బాలీవుడ్ సినిమా ద్వారా డెబ్యూ చేస్తుంది” అని చెప్పేయడంతో తెలుగులో పరిచయమయ్యే అవకాశం లేదనే విషయం తేటతెల్లమైపోయింది.

రీసెంట్ గా బాలీవుడ్ లోనూ జాన్వి కపూర్ ఎంట్రీ కోసం పలు సినిమాల రీమేక్స్ ను, సీక్వెల్స్ ను పరిగణలోకి తీసుకొన్నారు. కరణ్ జోహార్ “స్టూడెంట్ నెం 1” సీక్వెల్ గా జాన్వి కపూర్ ను ఇంట్రడ్యూస్ చేయాలనుకొన్నప్పటికీ శ్రీదేవి సమ్మతించకపోవడంతో ఆమె స్థానంలో సైఫ్ కూతుర్ని తీసుకొన్నారు. ఆ తర్వాత మరాఠీ సూపర్ హిట్ చిత్రం “సైరత్” హిందీ రీమేక్ లో జాన్వీ ఎంట్రీ ఫిక్స్ అని అందరూ ఫిక్స్ అయిపోయిన తరుణంలో ఇప్పుడు ఆ సినిమాతో కూడా కాదు.. శ్రీదేవితో కలిసి “మిస్టర్ ఇండియా 2″తోనే జాన్వీ కపూర్ ఆన్ స్క్రీన్ డెబ్యూ అని టాక్ వినిపిస్తోంది. బోణీకపూర్ ఈ చిత్రాణి స్వయంగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ కు వెళ్లనుందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus