మెగాస్టార్ చిరంజీవి సినిమాలను చూస్తూ పెరిగి, ఆయన స్పూర్తితో హీరోగా మారిన నటుడు శ్రీకాంత్. సినిమాల్లోకి రాకముందు చిరు ని ఎంతగా అభిమానించారో, వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువగా అభిమానించారు. చిరంజీవిని అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే శ్రీకాంత్ శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ లో సినిమాల్లో నటించారు. తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్ 150 మూవీలో శ్రీకాంత్ కూడా ఉంటారని అందరూ భావించారు. ఆయన లేకపోవడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందా? అనే అనుమానం కలిగింది. ఇదే డౌట్ ని శ్రీకాంత్ ముందు ఉంచగా.. ” మామధ్య ఎటువంటి దూరం పెరగలేదు. నిత్యం అన్నయ్యతో మాట్లాడుతుంటా. నిన్న కూడా కలిశా. ఖైదీ నంబర్ 150 సినిమాలో సరైన పాత్ర లేకపోవడంతోనే నటించలేకపోయా.
మిస్సయ్యాననే ఫీలింగ్ వుంది. కచ్చితంగా మళ్లీ ఏటీఎం లాంటి పాత్రలో చిరంజీవితో కలిసి నటిస్తా” అని చెప్పారు. ఇంకా చిరు సినిమా గురించి మాట్లాడుతూ ” పదేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి ఎలా ఉంటారో చూడాలని ఖైదీ నంబర్ 150 సినిమాకు వెళ్లా. నాలుగుసార్లు చూశా. డ్యాన్స్, నటనలో ఆయనలో ఓ యువకుడి ఉత్సాహం కనిపించింది. పదేళ్లకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. అంత గ్యాప్ తీసుకుని కూడా నటనలో ఎటువంటి మార్పులేకపోవడం అద్భుతం” అంటూ అన్నయ్యని అభినందనలతో ముంచెత్తారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.