Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

ప్రముఖ నటుడు శ్రీకాంత్‌, మాజీ కథానాయిక ఊహ కుమార్తె మేధ హీరోయిన్‌ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని ఏళ్ల క్రితం ‘నా కూతురు హీరోయిన్‌ అవ్వాలని అనుకోవడం లేదు’ అంటూ శ్రీకాంత్‌ దంపతులు షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. లుక్స్‌ విషయంలో తల్లి ఊహను పోలిన ఆమె హీరోయిన్‌ అయితే బాగుండు అని చాలామంది అనుకున్నారు. వారందరూ అనుకున్నట్లు ఇప్పుడు మేధ హీరోయిన్ అయిపోయింది. ఈ మేరకు ఓ సినిమాను ప్రకటించారు కూడా.

Medha Meka

మేధ లీడ్ రోల్‌లో ‘మైత్రి ఇన్ లవ్’ అనే పేరుతో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను అనౌన్స్‌ చేసింది. ఈ సినిమాతో పృథ్వీ వనం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన గతంలో ‘30 వెడ్స్‌ 21’ అనే వెబ్‌సిరీస్‌తో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో డైరక్టర్‌ అవుతున్నారు. ఈ సినిమాలో హీరోగా జై జాస్తి నటిస్తున్నాడు. ‘రాజమండ్రి రోజ్‌ మిల్క్‌’ సినిమాతో ఇప్పటికే జై తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.

మేధ ఇప్పటికే ఓసారి కెమెరా ముందుకు వచ్చింది. అనుష్క శెట్టి ‘రుద్రమదేవి’ సినిమాలో చిన్ననాటి రుద్రమదేవి పాత్రలో మేధ నటించింది. ఇప్పుడు హీరోయిన్‌ అవుతోందన్నమాట. ఇక ఈ సినిమాను ‘రా రా కృష్ణయ్య’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా దర్శకుడు మహేష్ బాబు.పి షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ గురువారం సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు బయటకు వస్తాయి.

శ్రీకాంత్‌ కుటుంబం నుండి ఇప్పటికే హీరోగా రోషన్‌ వచ్చాడు. ‘ఛాంపియన్‌’ సినిమాతో తనెంటో నిరూపించుకున్నాడు. త్వరలో ‘ఏమో ఏమో ఇది’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మేధ వస్తోంది. రోషన్‌లా తొలి విజయం కోసం కొన్ని రోజులు ఆగాల్సి వస్తుందా.. లేక తొలి సినిమాతోనే అందుకుటుందా అనేది చూడాలి. అన్నట్లు ఈ సినిమాకు అనిల్‌ యర్నేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus