RGV Dance Video: ఆర్జీవీ చేసిందాంట్లో తప్పేమీ లేదు : నటుడు శ్రీకాంత్ అయ్యంగార్

  • August 27, 2021 / 01:21 PM IST

రెండు రోజుల నుండీ ఆర్జీవీ,నటి జ్యోతిల రాసలీలల వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది. ఓ క్లబ్ లో డ్యాన్స్ చేస్తున్న మాదిరి ఒళ్ళు తెలీకుండా మత్తులో డ్యాన్స్ చేస్తున్నట్టు చేశారు వీళ్ళిద్దరు.అంతకు ముందు వర్మతో మరో హీరోయిన్ కూడా చిందులేసింది. ఈ వీడియోల గురించి రకరకాల నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఎప్పటి లానే వర్మని తిట్టి పోస్తున్నారు నెటిజన్లు. అయితే నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మాత్రం వర్మని వెనకేసుకొస్తున్నాడు. అసలు ఆ విషయంలో వర్మ తప్పే లేదంటున్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడూతూ.. “ఆ వీడియోలు నా ఇంట్లో తీసినవే. కొన్ని నెలలుగా నా జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకున్నాయి. పాత చాప్టర్ ఎండ్ అయ్యింది కొత్త చాప్టర్ స్టార్ట్ అయ్యింది. ఆర్జీవీ గారు నాకు గాడ్ ఫాదర్ లాంటి వారు.

నేను దేవుడ్ని నమ్మను కానీ అట్లాంటి వ్యక్తిని నమ్ముతాను. నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి అతను.ఓరోజు ఆయన నాతో.. శ్రీకాంత్ కొత్త ఇంట్లో ఉన్నావ్.. ఒంటరిగా ఉన్నావ్.. సింగిల్‌గా ఉన్నావ్.. ఇంటికి రావొచ్చా? అని అడిగారు.దానికి నేను.. ‘మీరు అడగడం ఏంటి సార్.. ఇది మీ హౌస్ రండి’ అని ఆహ్వానించాను. ఆయన వెంట మరో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందులో అప్ కమింగ్ హీరోయిన్ (ఇనయా సుల్తానా) కూడా ఉంది.ఆరోజు ఆమె బర్త్ డే అని చెప్పడంతో వెంటనే కేక్ తెప్పించి సెలబ్రేట్ చేసాం.వోడ్కా ఎక్కువ తాగడంతో బోర్డర్ దాటేశాం. వర్మగారు మనసారా జీవించే వ్యక్తి. ఎలా బ్రతకాలనుకుంటాడో అలానే బ్రతుకుతాడు. ఆ అమ్మాయితో డాన్స్ చేస్తానంటే.. ఆమె ఏమీ ఫీల్ కాలేదు.

ఆమె మాత్రమే కాదు ఏ అమ్మాయి కూడా వర్మ గారిని అన్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వదు. ఆ అమ్మాయిని ఏదో చేసేద్దాం అని వర్మ గారికి ఉండదు. ఆయన ఓ వైల్డ్ మ్యాన్. నేను కూడా అంతే. ఆ వీడియో ఎలా వచ్చిందో నాకు తెలియదు.నీకు, నాకు ప్రాబ్లమ్ ఏం ఉండదు శ్రీకాంత్.. పాపం ఆ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లమ్ అయితే ఏంటి పరిస్థితి అని ఆయన కూడా అన్నారు..! గట్టి పిల్ల సార్ అని నేను చెప్పా. కొంతమంది బ్యాచ్ ఉంటారు.. పలానా అమ్మాయి అట్లాంటిది… ఇట్లాంటిది అంటూ చెబుతూ ఉంటారు.నా దృష్టిలో అదో దరిద్రపు తాలిబన్ బ్యాచ్. అలాంటి వాళ్లని మేము పట్టించుకోం.ఒక అమ్మాయి గురించి నీఛంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అని భారతదేశ సంస్కృతిలో రాసి ఉంది” అంటూ మిడిల్ ఫింగర్ చూపించారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus