తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చే ముందు చెన్నైలో ఉండేదనే విషయం తెలిసిందే. ఇక్కడకి పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో చాలామంది హీరోలు మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లేవారు. అంటే ఇప్పుడు హీరోయిన్లు ఇక్కడికి వచ్చి సినిమాలు చేసి తిరిగి వెళ్లినట్లు… అప్పుడు మద్రాసు నుండి హైదరాబాద్ వచ్చారు. ఆ రోజుల్ని తాజాగా ప్రముఖ నటుడు శ్రీకాంత్ గుర్తు చేసుకున్నారు. శ్రీకాంత్‌కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టమట. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎక్కువగా బైక్ పైనే తిరిగేవారట.
షూటింగ్‌ల కోసం మద్రాస్ నుండి హైదరాబాద్‌కు బైక్‌పై వచ్చిన రోజులు చాలానే ఉన్నాయట. అయితే కుటుంబ బాధ్యతలు పెరుగుతున్న సమయంలో భద్రతను దృష్టిలో పెట్టుకుని బండి వాడకాన్ని తగ్గించేశా అని శ్రీకాంత్ నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. అయితే ‘ఇదే మా కథ’ సినిమాలోబైక్ రైడింగ్ చేయడం ఎంతో ఆనందంగా అనిపించింది అని చెప్పారు. ‘ఇదే మా కథ’ గురించి చెబుతూ… దర్శకుడు గురు చెప్పిన కథలో ఆయన నిజ జీవితంలో చూసిన కొన్ని సంఘటనలున్నాయి.
భిన్న నేపథ్యాల నుండి వచ్చిన నలుగురు బైక్ ట్రావెలర్స్ కలిసి.. హైదరాబాద్ నుంచి లద్దాఖ్‌కు చేసిన ప్రయాణమే ఈ సినిమా అని చెప్పారు శ్రీకాంత్.