ఆ దర్శకులపై శ్రీకాంత్ దృష్టి పెడితే బెటర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీకాంత్ కొడుకు రోషన్ ఐదేళ్ల క్రితం నిర్మలా కాన్వెంట్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. నిర్మలా కాన్వెంట్ తర్వాత కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న రోషన్ నటించిన పెళ్లిసందD సినిమా నిన్న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నిర్మలా కాన్వెంట్ సినిమా ఔట్ డేటెడ్ సినిమా అని కామెంట్లు వినిపించగా తాజాగా విడుదలైన పెళ్లిసందD సినిమా కూడా ఔట్ డేటెడ్ సినిమా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఆయన శిష్యురాలు గౌరీ రోణంకీ ప్రేక్షకులను మెప్పించేలా పెళ్లి సందడి సినిమాను తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యారు. ప్రేక్షకుల నుంచి ఈ సినిమా గురించి తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుస ఫ్లాపుల వల్ల రోషన్ కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రీకాంత్ కొడుకు సినిమాలకు టాలెంట్ ఉన్న యువదర్శకులకు అవకాశం ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ కొడుకు కోసం రొటీన్ కథలను ఎంచుకుంటూ తప్పు చేశారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

శ్రీకాంత్ రోషన్ తరువాత సినిమాల విషయంలోనైనా జాగ్రత్త పడతారో లేదో చూడాల్సి ఉంది. రోషన్ తర్వాత సినిమా కూడా ఫ్లాప్ అయితే అతనికి కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది. రోషన్ కూడా యూత్ కు నచ్చే కథలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని శ్రీకాంత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. రోషన్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus