తనకు పేరు తెచ్చిన టీవీ షోను కాదనుకొన్న శ్రీముఖి
- May 15, 2019 / 05:44 PM ISTByFilmy Focus
“జులాయి” సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా కనిపించడానికంటే ముందు ఈటీవీలో యాంకర్ గా వర్క్ చేసిన శ్రీముఖి గురించి జనాలెవరికీ తెలియదు. కానీ.. ఆమె “పటాస్” షోతో ఫుల్ టైమ్ యాంకర్ గా మారిన తర్వాత మాత్రం ప్రతి బుల్లితెర ప్రేక్షకుడికి ఆమె పరిచయమైంది. శ్రీముఖికి సూపర్ ఫ్యాన్ బేస్ తీసుకురావడమే కాక ఆమెను స్టార్ యాంకర్ గా మార్చడంలో “పటాస్” ప్రధాన పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని సందర్భాల్లో శ్రీముఖికి సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ.. వాటిని కాదనుకొని మరీ పటాస్ లో కంటిన్యూ అయ్యింది శ్రీముఖి. దాంతో “జబర్డస్త్”ను అనసూయ, రష్మీ వదలనట్లు.. “పటాస్”ను కూడా శ్రీముఖి ఎప్పటికీ వదలదు అనుకొన్నారందరూ.
- మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
కట్ చేస్తే.. కారణాలు ఏంటనేవి తెలియవు కానీ శ్రీముఖి “పటాస్” షో నుంచి అవుట్ అనే వార్తలు హల్ చల్ చేయడం మొదలెట్టాయి. ఆమె స్థానంలో వర్షిణి ఇకపై పటాస్ షోలో కనిపించనుందట. అయితే.. ఇదే విషయమై శ్రీముఖిని సంప్రదిస్తే.. కొన్నాళ్లపాటు గ్యాప్ తీసుకొంటున్నానని, తాను పటాస్ ను వదలడం లేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఉన్నట్లుండి శ్రీముఖి అలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.













