వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా గురించి ఎదురుచూడని వారుండదరు. ఎందుకంటే త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు వెంకటేశ్‌తో చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలు సాధించిన విజయం అలాంటివి మరి. ఆ సినిమా విజయంలో రైటింగ్ పాత్ర చాలా కీలకం అని చెప్పొచ్చు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ సెట్ సెట్ చేద్దామని నిర్మాత సురేశ్ బాబు ఎన్నో ఏళ్లుగా ట్రై చేయడం, అది అవ్వకపోవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఎట్టకేలకు ఇటీవల ఈ సినిమా సెట్ అయింది. షూటింగ్ గురించి టీమ్ అధికారికంగా అనౌన్ష్ కూడా చేసింది.
ఇప్పడు విషయం ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అని. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కొంతమంది హీరోయిన్ల పేరు వినిపిస్తున్నాయి. అందులో ఓ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెనే శ్రీనిధి శెట్టి. త్వరలో ‘తెలుసు కదా’ ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీనిధి శెట్టిని వెంకీ సినిమాలో హీరోయిన్ ‘మీరేనట కదా’ అని అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఇటు లేదు అని చెప్పలేదు.. అటు ఉంది అని చెప్పలేదు. మొత్తంగా ఓ తెలివైన సమాధానం ఇచ్చి తప్పుకుంది అని చెప్పాలి.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న వెంకటేశ్ – త్రివిక్రమ్ సినిమాషూటింగ్ ఇటీవల షురూ అయింది. ఈ సందర్భంగా సెట్స్‌లో వెంకటేశ్, త్రివిక్రమ్ దిగిన ఫొటోను నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘‘20 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మళ్లీ కెమెరా వెనక్కి వచ్చారు. వెంకటేశ్‌తో చేతులు కలిపారు. ‘ది ఓజీస్’ ఎంటర్‌టైన్‌మెంట్ పునరావృతం కానుంది’’ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. అప్పుడే హీరోయిన్ల పేర్లు చర్చకు వచ్చాయి.
ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశమున్నట్లు వార్తలు వచ్చాయి. త్రిష, నిధి అగర్వాల్, రుక్మిణీ వసంత్, శ్రీనిధి శెట్టి = పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం వినిపించింది. ఇప్పుడు శ్రీనిధి దగ్గర అదే విషయాన్ని ప్రస్తావిస్తే.. వెంకటేశ్ – త్రివిక్రమ్ సినిమాలో నేను ఉన్నానో లేదో నిజంగా నాకు తెలియదు. ఆ అవకాశం అయితే రావాలని బలంగా కోరుకుంటున్నాను. అందులో హీరోయిన్ ఎవరన్నది నిర్మాతలే ప్రకటిస్తారు అని చెప్పింది. అలా చెప్పీ చెప్పకుండా లీక్ ఇచ్చినట్లు ఉంది.