ఎప్పుడో నాలుగేళ్ల క్రితం హీరోగా చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఐదేళ్ల క్రితం ఆసక్తికరమైన సినిమా తీసిన దర్శకుడు ఇప్పుడు కలిసి రాబోతున్నారు. ఈ సారి రాయలసీమ నేపథ్యంలో 90ల కాలం నాటి కథను చూపించబోతున్నారు. సినిమా పేరు కూడా కొత్తగా ఉంది. అదే ‘ఘోడా’. రాయలసీమ ప్రాంతం వారికి ఇది సుపరిచితమైన పేరే. ఘోడా అంటే నాటు తుపాకి అని అర్థం అట. ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమా విడుదల కోసం సిద్ధంగా ఉన్న అవసరాల శ్రీనివాస్ మరో కొత్త సినిమాకు ఓకే చెప్పేశాడు.
యూవీ క్రియేషన్స్ వారి మరో కాన్సెప్ట్ ప్రొడక్షన్ హౌస్ యూవీ సెల్యూలాయిడ్స్ పతాకంపై ఓ సినిమా రూపొందుతోంది. ‘రాజా చెయ్యి వేస్తే’ ఫేమ్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘ఘోడా’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రధారి. ఇందులో అవసరాలు ఎన్‌ఆర్‌ఐగా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర ఆయనకు బాగా అలవాటైనదే. ఈ రోజు మొదలు కాబోతున్న ఈ సినిమాను 50 రోజుల్లో పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. వికారాబాద్, అనంతపురం పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరిస్తారు.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?