Srinu Vaitla, Mahesh Babu: శ్రీనువైట్లకు మహేష్ బాబు ఛాన్స్ ఇస్తారా?

Ad not loaded.

స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల ఒకప్పుడు వరుస విజయాలతో దర్శకునిగా కెరీర్ ను కొనసాగించగా ఈ మధ్య కాలంలో శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం శ్రీనువైట్ల మంచు విష్ణుతో డి అండ్ డి సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు శ్రీను వైట్ల కాంబినేషన్ లో దూకుడు, ఆగడు సినిమాలు తెరకెక్కగా దూకుడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే ఆగడు మూవీ డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది.

అయితే శ్రీను వైట్ల మాత్రం మహేష్ బాబుతో మరో సినిమాను తెర్కకెక్కించి సక్సెస్ సాధించాలని ఆశ పడుతున్నారు. దూకుడు సినిమా రిలీజై నేటికి పది సంవత్సరాలు కావడంతో శ్రీనువైట్ల మీడియాతో ముచ్చటించారు. మంచి కథ రాయడం కంటే కామెడీతో కూడిన కథ చేయడం కష్టమని శ్రీను వైట్ల తెలిపారు. సరైన కథలను ఎంచుకున్న ప్రతిసారి విజయాలు దక్కాయని శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు. తనకు, మహేష్ కు మధ్య వేవ్ లెంగ్త్ బాగా కుదరడంతో దూకుడు హిట్టైందని ఆగడు సినిమాలో హీరో ఎలివేషన్ సన్నివేశాలకు మంచి పేరు వచ్చిందని శ్రీను వైట్ల పేర్కొన్నారు.

తాను వరుసగా మూడు సినిమాలకు కమిటయ్యానని ఈ సినిమాల తర్వాత మహేష్ తో చేయాలని ఉందని శ్రీను వైట్ల వెల్లడించారు. మహేష్ కోసం అద్భుతమైన ఐడియా తన దగ్గర ఉందని ఆ ఐడియాను అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే మూవీగా తీయాలని ఉందని శ్రీను వైట్ల తెలిపారు. మహేష్ బాబు శ్రీను వైట్లకు మరో ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus