టాలీవుడ్ హీరోలు ద్విభాషా చిత్రాల రేసు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దర్శకులు ఆ దిశగా అడుగులేస్తున్నారని తెలియవస్తోంది. ఈ సంక్రాంతికి బాలయ్యను ‘డిక్టేటర్’గా చూపించి మంచి విజయాన్ని అందుకున్న శ్రీవాస్ నేటి తరంలో తెలుగు చిత్రసీమ నుండి ద్విభాషా చిత్రాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు.
తెలుగు కుర్రాడైన విశాల్ తమిళ కథానాయకుడిగా గుర్తింపు పొంది బాగానే రాణిస్తున్నాడు. అనువాద సినిమాలతో తెలుగులోనూ అభిమానులను ఏర్పరుచుకున్న ఇతగాడు నేరుగా తెలుగులో ఓ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. శ్రీవాస్ విశాల్ కోరికను తీర్చనున్నాడట. ఈ సినిమా తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కుతుందని పరిశ్రమ వర్గాల కథనం. అయితే విశాల్ ‘కత్తిసండై’ (తెలుగులో ఒక్కడొచ్చాడు), లింగుసామితో పందెంకోడి సీక్వెల్, టెంపర్ రీమేక్ సహా మిస్కిన్ దర్శకుడిగా మరో సినిమా వంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి శ్రీవాస్-విశాల్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో..?