పవన్ కల్యాణ్ ‘ఓజీ’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ అయితే థియేటర్లలో పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ సినిమాలో పవర్ స్టార్ పెర్ఫార్మెన్స్‌తో పాటు, గీత పాత్రలో నటించిన శ్రియా రెడ్డి యాక్టింగ్ కూడా అదిరిపోయింది. సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో ఫుల్ ఖుషీగా ఉన్న ఆమె, తాజాగా డైరెక్టర్ సుజీత్‌ను ఆకాశానికెత్తుతూ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.
“సుజీత్ పెన్నులోంచి వచ్చిన క్యారెక్టర్ స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేసింది. ‘ఓజీ’ లాంటి భారీ ప్రాజెక్ట్‌లో ఒక నటికి అంత పవర్‌ఫుల్ రోల్ ఇవ్వాలంటే డైరెక్టర్‌కు చాలా కాన్ఫిడెన్స్, మంచి మనసు ఉండాలి. సుజీత్ అలాంటి డైరెక్టర్. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. మీ హార్డ్ వర్క్, సినిమాపై మీకున్న నమ్మకం, మీరు పడిన కష్టం, చేసిన త్యాగాలకు ఈ సక్సెస్ ఒక నిదర్శనం.
ఈ విజయానికి మీరు 100% అర్హులు” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.’ఓజీ’ ఫీవర్ కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేదు. కోలీవుడ్‌ను కూడా గట్టిగానే తాకింది. ‘లవ్ టుడే’ ఫేమ్, యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ‘ఓజీ’ సినిమా చూడటం కోసమే స్పెషల్‌గా హైదరాబాద్ వచ్చారు. ఇక్కడి ఆడియన్స్‌తో కలిసి థియేటర్‌లో సినిమా చూస్తూ రచ్చ చేస్తున్న వీడియోను షేర్ చేశారు.
‘ఈ మాస్ ఫీస్ట్‌ను తెలుగు ఆడియన్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.