యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి శృతిహాసన్. స్టార్ హీరో వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ కెరియర్ మొదట్లో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ అందుకున్న శృతిహాసన్ అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఇకపోతే ఈమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ క్రాక్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమా హిట్ కావడంతో ఏకంగా ప్రభాస్,బాలకృష్ణ చిరంజీవి వంటి హీరోల సినిమా అవకాశాలను అందుకుని ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
బాలకృష్ణ సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు. శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా తన ఫోటోని షేర్ చేస్తూ తన ఫోటోతో పాటు యానిమేషన్ చిత్రం ది టేల్ ఆఫ్ ప్రిన్సెస్ కగుయా ఫోటోలను షేర్ చేసింది.
ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. జీవిత కాలాలు క్రమంగా వస్తుంటాయి వెళ్తుంటాయి. ఏదో ఒక రోజు ఇదంతా కలగా మారిపోతుందని.నాలో ఏదో మార్పు తెచ్చిన ఈ అత్యంత అందమైన చిత్రాన్ని నాకు పరిచయం చేసినందుకు @santanu_hazarika_artకి ధన్యవాదాలు అంటూ ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ షేర్ చేశారు.
శృతిహాసన్ శాంతను హజారిక అనే చిత్రకారుడితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతనితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా వీరిద్దరూ ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే.ఇలా రిలేషన్ లో ఉన్నటువంటి శృతిహాసన్ తనకు ప్రేమతో తనకు భయం అంటూ ఎన్నో సందర్భాలలో పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!