పవన్ సినిమాకి థమన్ దరువు..!

  • November 8, 2016 / 11:53 AM IST

2010లో కిక్ సినిమాతో కెరీర్ ఆరంభించిన థమన్ అతి తక్కువ కాలంలోనే 50 సినిమాల రేఖను దాటేశాడు. మహేశ్ హీరోగా నటించిన ‘ఆగడు’ సంగీత దర్శకుడిగా థమన్ 50వ చిత్రం. ఈ ప్రయాణంలో టాలీవుడ్ లోని రవితేజ, మహేశ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సినిమాలకు పనిచేసిన థమన్ పవన్ సినిమాకి స్వరాలు అందించలేదు. ఆ లోటు ఇప్పుడు తీరనుంది.పవన్ తమిళ దర్శకుడు ఆర్.టి.నేశన్ దర్శకుడిగా ఓ సినిమా చేయనున్న సినిమా తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించనున్న ఈ సినిమాకి బాణీలు కట్టే బంపర్ ఛాన్స్ కొట్టేశాడు థమన్.

తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ సినిమాలకు సైతం సంగీతం అందించాడు థమన్ బాబు. అంచేత అక్కడ ఇతగాడికి పరిచయాలు బాగానే ఉన్నాయి. వాటితోనే ఈ అవకాశం వచ్చిందని గుసగుసలు. అజిత్ నటించిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ‘కాటమరాయుడు’, త్రివిక్రమ్ తో చేయనున్న సినిమాలు పూర్తి చేశాకే పవన్ నేశన్ సినిమాని మొదలెట్టనున్నాడట. ఇదిలా ఉంటే థమన్ అంటేనే డప్పుల దరువులకి కేరాఫ్ అడ్రస్ అన్న పేరుంది. పవన్ సినిమాతోనైనా ఆ పేరు మార్చుకుంటాడో లేదో..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus