Star Actress: వాళ్లు అలా చేస్తే ఓకే.. మేం చేస్తే తప్పా? స్టార్‌ హీరోయిన్‌ ప్రశ్న!

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని మన పెద్దలు మన చిన్నప్పటి నుండి చెబుతూనే ఉన్నారు. దీనిని ఎంతమంది పట్టించుకుని బాగా సంపాదించుకున్నారు అనేది తెలియదు కానీ.. మన సినిమావాళ్లు మాత్రం దీన్ని బాగానే వాడుతుంటారు. అయితే అందులోనూ కొంతమందే అనుకోండి. సినిమాల్లో నటిస్తూ మంచి పేరు, ప్రతిష్ఠలు ఉన్నప్పుడు నిర్మాతగా మారుతుంటారు. అలా మంచి సినిమాలు చేసి డబ్బులు సంపాదిస్తుంటారు. ఇంకొందరు పప్పులో కాలేస్తుంటారు కూడా. అయితే ఇలా నిర్మాతలుగా మారిన వారిలో హీరోలే ఎక్కువ మంది ఉంటారు. హీరోయిన్లు తక్కువ మందే.

అయితే బాలీవుడ్‌లో హీరోయిన్లు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగన రనౌత్‌ ఒకరు. ప్రపంచంలో ప్రతి విషయం మీద స్పందించే ఈ భామ.. తాజాగా నటులు నిర్మాతలు అవ్వడం గురించి మాట్లాడింది. అయితే మాట్లాడింది అనే కంటే.. మరోసారి తన నోటికి పని చెప్పింది అనొచ్చు. ఆమె తాజాగా ‘టీకూ వెడ్స్‌ షేరూ’ అనే సినిమా నిర్మించింది. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ నెల 23న విడుదలవుతోంది.

ఈ నేపథ్యంలో ( Actress) ఆమె స్పందించింది. ఈ క్రమంలో ఎప్పటిలాగే స్టార్‌ హీరోలను మధ్యలోకి లాగింది. నిర్మాతగా మారాను, ఎందుకు మారాను అంటూ రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. అయితే బాలీవుడ్‌లో షారుఖ్‌ ఖాన్‌, అజయ్‌ దేవగణ్‌, అక్షయ్‌ కుమార్‌ లాంటి హీరోలు నిర్మాతలుగా మారినప్పుడు ఎవరూ పెద్ద విషయంగా చూడలేదు. నా లాంటి కథానాయికలు ఆ పని చేస్తే వింతగా చూస్తున్నారు.

అసలు ఈ డిఫరెన్స్‌ ఏంటో నాకు అర్థం కావడం లేదు అని కామెంట్‌ చేసింది కంగన. రొమాంటిక్‌ కామెడీ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సాయి కబీర్‌ దర్శకుడు. హీరోలతోపాటు దర్శకుల్ని కూడా ఈ చర్చలోకి లాగింది కంగన. తనతో పని చేసిన దర్శకులు సినిమా నిర్మాణంలో భాగస్వామి అవ్వమని చెబుతుంటారని, అందుకే ఈ కొత్త పాత్రని ఎంచుకున్నాను అని చెప్పింది. దీంతో కంగన మరోసారి వార్తల్లో నిలిచింది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus