విజయ్ భార్య గురించి షాకింగ్ విషయాలు చెప్పిన ప్రముఖ నటి.. ఏమైందంటే?

విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో లియో సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు ఒకింత నెగిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా హిట్ అనే సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన అభిమాని సంగీతను వివాహం చేసుకున్నారు. విజయ్ సంగీత జోడీ క్యూట్ కపుల్ అని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారనే సంగతి తెలిసిందే. సంగీత విషయానికి వస్తే ఆమె లండన్ లో స్థిరపడ్డ తమిళ కుటుంబం అమ్మాయి కావడం గమనార్హం.

విజయ్ నటనకు ఫిదా అయ్యి ఆయనకు అభిమానిగా మారిపోయిన సంగీత విజయ్ కోసం లండన్ నుంచి చెన్నైకి వచ్చారు. విజయ్ ను కలవగా విజయ్ కు కూడా సంగీత నచ్చడంతో వీళ్లిద్దరి వివాహం జరిగింది. 1999 సంవత్సరంలో విజయ్ సంగీత వివాహం జరగగా ఈ జోడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ జంటకు జేసన్ సంజయ్, శాషా సంతానంగా ఉండటం గమనార్హం.

విజయ్ సంగీత విడాకులు తీసుకోనున్నారని కొన్ని ఫేక్ వార్తలు వైరల్ కాగా ఆ వార్తల గురించి ఈ జోడీ స్పందించలేదు. అయితే లియో నటి జనని విజయ్ గురించి, విజయ్ భార్యపై చూపించే ప్రేమ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ తో కలిసి కూర్చునే అవకాశం వచ్చినందుకు పొంగిపోయానని జనని తెలిపారు. విజయ్ నాతో మాట్లాడతాడని నేను కలలో కూడా ఊహించలేదని జనని చెప్పుకొచ్చారు.

నేను శ్రీలంకన్ అని నేను తమిళ్ మాట్లాడుతుంటే విజయ్ (Vijay) తన భార్య సంగీత గుర్తుకువచ్చిందని చెప్పారని జనని కామెంట్లు చేశారు. సంగీత కూడా నాలాగే శ్రీలంకలోని జఫ్నాలో పుట్టి పెరిగిందని జనని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విజయ్ నాకు స్వయంగా చెప్పాడని జనని తెలిపారు. విజయ్ నన్ను చెల్లిలా చూసుకున్నారని మంచిగా మాట్లాడారని జనని వెల్లడించారు. జనని చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus