బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం ‘లాకప్’ అనే షోను హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకి మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. ఈ షోలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలంటే కంటెస్టెంట్స్ ఏదైనా సీక్రెట్ చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కొక్కరూ చెప్పే సీక్రెట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పటికే నటి పూనమ్ పాండే పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. తాజాగా పూనమ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
తన సొంత కుటుంబమే తనను ఇంట్లో నుంచి గెంటేసిందని ఎమోషనల్ అయింది పూనమ్. మూడు నాలుగేళ్ల క్రితం తన ఫ్యామిలీను హోసింగ్ సొసైటీ నుంచి బయటకు పంపించేశారని చెప్పింది పూనమ్. అప్పటివరకు తను తన తల్లితండ్రులు, సోదరితో కలిసి జీవించేదట. కేవలం పూనమ్ పాండే ఫ్యామిలీ అనే కారణంతోనే వెలేశారట. అయితే సొసైటీ నుంచి బయటకు పంపించేసినా.. దానికి కారణం ఏంటనేది తన పేరెంట్స్ తనతో డిస్కస్ చేయలేదని చెప్పింది.
అప్పటికి ఫ్యామిలీని మొత్తం తనే మెయింటైన్ చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది. అయితే కొన్నాళ్లకు తన వాళ్లే తనను ఇంటి నుంచి గెంటేశారని చెప్పింది పూనమ్. ఏం జరిగిందో కూడా చెప్పకుండా అలా చేశారని బాధపడింది. ఇప్పటివరకు తను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని.. ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదని.. కానీ అందరూ తనను జడ్జ్ చేస్తుంటారని చెప్పింది. అలా మాట్లాడే ముందు, తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటూ కన్నీటి పర్యంతమయ్యింది. గతేడాది శామ్ బాంబే అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ కొన్నాళ్లకే అతడు హింసిస్తున్నాడని డొమెస్టిక్ వయిలెన్స్ కేసు పెట్టింది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!