సమాజంలో మహిళలకు రక్షణ గౌరవం లేకుండా పోతుంది. నమ్మిన వారే నట్టేట ముంచేస్తున్నారు. నేటి సమాజంలో అది మరి కాస్త ఎక్కువగా కనబడుతుంది.. మహిళలు ప్రేమ వ్యవహారంలో మోసపోవడం జరుగుతుంది.. అన్ని రంగాలతో పోలిస్తే సినిమా రంగంలో మహిళలు ఎక్కువగా మోసపోవడం జరుగుతుంది.. హీరోల చేతిలోనూ నిర్మాత చేతిలోనూ దర్శకుడు చేతిలోనూ మోసపోవడం కామన్.. కొంతమంది నటులు సినిమాలకు దూరంగా ఉంటూ తమ జీవితాన్ని కొత్తగా ప్రారంభిద్దామనుకున్న సమయంలో ఓ ఉద్యోగుతోనో బిజినెస్ మాన్ తోను ప్రేమలో పడి మోసపోవటం ఆనవాయితీ అవుతుంది.
అదే నేడు ఈ నటి జీవితంలో జరిగింది అసలేం జరిగిందో తెలుసుకుందాం… ఆర్థిక రాజధాని ముంబయిలో దారుణం జరిగింది. పెళ్లి పేరుతో ఓ బిజినెస్మెన్ అత్యాచారానికి పాల్పడినట్లు నటి పోలీసులను ఆశ్రయించింది. దీంతో నటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా ఏఎన్ఐ ట్వీట్ చేసింది. కాగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై పలుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని నటి ముంబై పోలీసులకు తెలిపింది.
ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టాంజానియాకు చెందిన వ్యాపారి వీరేన్ పటేల్‌పై ఎన్ఎం జోషి మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.