బిగ్ బాస్ షో పై హాట్ భామ సంచలన వ్యాఖ్యలు..!

‘ఈ మధ్య కాలంలో నేను చూసిన అత్యంత చెత్త షో’ అంటూ తాజాగా తమిళ నటి కస్తూరి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నటి కస్తూరి తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమే..! ‘అన్నమయ్య’ ‘చిలక్కొట్టుడు’ ‘ఆకాశ వీధిలో’ ‘డాన్ శీను’ వంటి చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 3’ కు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ హాట్ భామ. అయితే ఈ షోలో కొందరు హౌస్ మేట్స్.. ఈమెను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేవారు. మరికొంత మంది ఈమెకు అండగా నిలిచినప్పటికీ షో లో మాత్రం ఎక్కువ రోజులు ఉండకుండానే ఎలిమినేట్ అయ్యింది.

ఇదిలా ఉండగా.. ‘బిగ్ బాస్ లో కొందరికి ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ కావాలనే ఎలిమినేట్ చేయకుండా హౌస్ లో ఉంచుతున్నారు’ అంటూ ‘బిగ్ బాస్’ యూనిట్ సభ్యులు, అలాగే విజయ్ టీవీ వారి పై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇదే మంచి అవకాశం అనుకుందో ఏమో.. ‘ఈ మధ్యకాలంలో నేను చూసిన అత్యంత చెత్త షో’ అంటూ ట్వీట్ చేసింది. అయితే ‘బిగ్ బాస్’ అని మాత్రం మెన్షన్ చేయలేదు. ఏమైనా తమిళ ‘బిగ్ బాస్ 3’ మొదలైనప్పటి నుండీ వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus