పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్.. షాక్ లో అభిమానులు..!

అతిలోక సుందరి, దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ధడక్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ క్యూటీ.. తొలి సినిమాతోనే పాజిటివ్ టాక్ అందుకుంది. ఆ తర్వాత మరో సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ సక్సెస్ కాలేకపోయింది. ఎన్టీఆర్ సరసన ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న దేవర చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విజయం సాధిస్తే ఆమె క్రేజ్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.

ఈ సినిమా తర్వాత జాన్వీ – రామ్ చరణ్‌తో మరో సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుస షూటింగులతో బిజీగా ఉన్న ఈ క్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోషూట్ లను షేర్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఇప్పుడు జాన్వీ కపూర్ పెళ్లికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. (Janhvi Kapoor) జాన్వీ కపూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందని ఇండస్ట్రీ టాక్.

ఈ ముద్దుగుమ్మ త్వరలో తన ప్రియుడితో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోందని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారడంతో జాన్వీ ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. కాలేజ్ డేస్ నుంచి తనతో చాలా స్నేహంగా ఉండే శిఖర్ పహారియాతో జాన్వీ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారి పబ్బులు, పార్టీలు, వాకింగ్‌లు కాకుండా ఇప్పటికే జంటగా పలు పుణ్యక్షేత్రాలకు వెళ్లారు.

ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉండడంతో ఇరు కుటుంబాలు కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. వచ్చే ఏడాది వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus