Trisha: త్రిషకు ఇదే లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే అట..!

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది త్రిష. దశాబ్దకాలం పైనే ఆమె స్టార్ స్టేటస్ ను అనుభవించింది. అయితే ఇటీవల కాలంలో త్రిషకు ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ అప్పుడప్పుడు ’96’ వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. నిన్న ఈమె పుట్టినరోజు. నిన్నటితో త్రిష 38 వ ఏట అడుగు పెట్టింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎటువంటి హడావుడి లేకుండా చెన్నైలోని తన నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది.

ఆమె అభిమానులు కూడా నిన్న సోషల్ మీడియాలో ‘#HBDTrisha, #HappyBirthdayTrisha, #HappyBirthdayTrishaKrishnan, #HappyBirthdayTrisha’ వంటి హ్యాష్ ట్యాగ్ లతో సందడి చేశారు. ఇదిలా ఉండగా.. త్రిష స్నేహితురాలు అలాగే టాలీవుడ్ హీరోయిన్ ,నిర్మాత అయిన ఛార్మీ.. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్ పెద్ద చర్చకు దారి తీసింది. త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఛార్మి.. ‘ హ్యాపీయెస్ట్ బర్త్ డే త్రిష.

నీకు ఇదే నీ లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే అని నాకు అనిపిస్తుంది’ అంటూ పేర్కొంది. అంటే త్రిష తన బ్యాచిలర్ లైఫ్ కు త్వరలోనే గుడ్ బై చెప్పనుందని ఈమె ఇండైరెక్ట్ స్పందించినట్టు అయ్యింది. అందుకే ఛార్మీ ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. కొద్దిరోజులుగా త్రిష ఓ బిజినెస్మెన్ తో డేటింగ్లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus