సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కోసారి హద్దులు దాటి ప్రవర్తిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. తమ ఫాలోవర్స్ కోసమో లేక తమ సినిమాల ప్రమోషన్ల కోసమో లైవ్ లోకి వచ్చి చాట్ సెషన్ నిర్వహించే హీరోయిన్లకి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ అది వాళ్ళ వర్క్ లైఫ్ లో భాగం కాబట్టి తప్పదు అన్నట్టు మళ్ళీ మళ్ళీ లైవ్ లోకి వస్తూనే ఉంటారు. కొంతమంది నెటిజన్లు ఎలాంటి ఘోరమైన ప్రశ్నలు అడిగినా.. వాటిని సున్నితంగా స్కిప్ చేస్తుంటారు.
మరికొంతమంది అయితే ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. తాజాగా ఓ (Actress) హీరోయిన్ ను బ్రా సైజ్ అడిగాడు ఓ నెటిజన్. దీనికి ఆమె ఎలా రియాక్ట్ అయ్యుంటుందో గెస్ చేయమంటే.. ‘కచ్చితంగా తిట్టేసి ఉంటుంది’ అనే సమాధానాలు వినిపించవచ్చు. కానీ ఇక్కడ జరిగింది వేరు. వివరాల్లోకి వెళితే.. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తమిళ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఈ ఏడాది ‘కళ్యాణం కమనీయం’ అనే చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.
అలాగే రాఘవ లారెన్స్ హీరోగా వచ్చిన ‘రుద్రుడు’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈమెకి సోషల్ మీడియాలో ఓ చేదు అనుభవం ఎదురైంది. ‘నీ బ్రా సైజ్ ఎంత?’ అంటూ ఓ నెటిజన్ ఈమెను ఘోరంగా అవమానించాడు. అందుకు ఈమె ‘ 34D. బ్రెస్ట్ (వక్షోజాలు) అనేవి నేను కొత్తగా వేరే గ్రహం నుంచి తెచ్చుకున్నవి కావు. నీ జీవితంలో ఉన్న మహిళలకు కూడా ఉంటాయి. కాకపోతే.. నువ్వు వాళ్ళ టీషర్ట్స్ నుంచి కాస్త జూమ్ చేసి చూడాల్సి వస్తుంది. గుడ్ లక్ ‘ అంటూ సున్నితంగా సమాధానం ఇచ్చింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!
ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!