ప్రముఖ నటి కన్న కూతుర్నే చంపేసి.. ఆత్మహత్య చేసుకుందట

అవును ఈ ఘోరం శుక్రవారం నాడు చోటుచేసుకుంది. ప్రముఖ నటి తన 18 ఏళ్ళ కూతుర్ని చంపేసి.. ఆ తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. తాజాగా ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ఆర్ధిక సమస్యలే ఇందుకు కారణమని వారంటున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ప్రశాంత్ పార్కర్ (43) జిమ్ కి వెళ్ళాలని ఉదయాన్నే 7:30 గంటల ప్రాంతంలో ఇంటి నుండి బయటకి వెళ్లారు. ఆ సమయంలో ప్రశాంత్ భార్య ప్రాడ్న్య(40) తన కూతురు శృతి(18)తో కలిసి ఉంది. ఆ తరువాత ప్రశాంత్ ఇంటికి తిరిగివచ్చి ఇంటి డోర్ బెల్ కొట్టగా.. ఎవరూ తీయకపోవడంతో తాళాలు పగలగొట్టి లోపలకి వెళ్ళాడు. అలా వెళ్ళి చూడగా.. లివింగ్ రూమ్ లో తన కూతురు చనిపోయి ఉంది. బెడ్ రూమ్ లో తన భార్య ఫ్యాన్ కి దుప్పటితో ఉరి వేసుకొని చనిపోయి పడుంది.

దీంతో వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటీకే వాళ్ళిద్దరూ చనిపోయున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు… ప్రశాంత్ ను విచారించి ఆ ఇద్దరి చావులకు కారణం ఆర్ధిక సమస్యలేనని తేల్చారు. ప్రశాంత్ ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేస్తుంటాడు. అతని వ్యాపారం సరిగ్గా లేదు. దీంతో ఆమె భార్య ప్రాడ్న్య సీరియళ్లలో నటించడం మొదలుపెట్టింది. మరాఠీ సీరియల్స్ లో నటిస్తూ కొంతవరకూ సంపాదిస్తూ వస్తుంది. బాలీవుడ్ లో రూపొందుతున్న ‘సెక్షన్ 375’ అనే చిత్రంలో కూడా ఈమె ఓ పాత్ర చేసిందట. గత కొంతకాలంగా తమ కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండటం వల్ల ప్రాడ్న్య తట్టుకోలేకపోతుందట. దాంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని తెలుస్తుంది. ఆ కారణంగానే తన కూతుర్ని చంపేసి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus