Star Actress: సినీ పరిశ్రమలో ఘోర విషాదం.. నటి తండ్రి కన్నుమూత.!
- September 11, 2024 / 01:48 PM ISTByFilmy Focus
బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా బలవన్మరణానికి పాల్పడ్డారట. ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న అనిల్ టెర్రస్ అంటే 7వ అంతస్తు నుండి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జనాలను,మీడియాని కంట్రోల్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే అనిల్ అరోరా మృతి పై కూడా దర్యాప్తు చేపట్టారని సమాచారం.
Star Actress Malaika Arora

ఈ వార్త తెలుసుకున్న మలైకా (Star Actress) అండ్ ఫ్యామిలీ షాక్ కి గురైనట్టు సమాచారం. అనిల్ మృతి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మలైకా ఫ్యామిలీ ఫ్యామిలీకి అంటే అనిల్ అరోరాకి పెద్దగా ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ లేవు అని బాలీవుడ్ మీడియా చెబుతుంది. మరి ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అసలు నిజంగా అతనికి ఆత్మహత్యా? లేక ఇంకెవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది.

ఇక మలైకా (Star Actress) అందరికీ సుపరిచితమే. ఆమె స్పెషల్ సాంగ్స్, ఐటెం సాంగ్స్ తో బాగా పాపులర్ అయ్యింది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను ఈమె గతంలో పెళ్లి చేసుకోవడం, తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. ఈ దంపతులకి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అటు తర్వాత అర్జున్ కపూర్ తో ఈమె ప్రేమలో పడటం. అతనితో సహజీవనంలో ఉండటం కూడా అందరికీ తెలిసే ఉంటుంది.












