Devara Trailer Review: దేవర’ బ్రతికున్నాడా? చనిపోయాడా?
- September 10, 2024 / 05:31 PM ISTByFilmy Focus
ఎన్టీఆర్ (Jr NTR) , దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘దేవర'(Devara). ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కళ్యాణ్ రామ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీదేవి (Sridevi) కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది. అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి.
Devara Trailer Review

గ్లింప్స్ కూడా మెప్పించింది. సెప్టెంబర్ 27న ‘దేవర’ (Devara) విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను వదిలింది చిత్ర బృందం. 2 నిమిషాల 39 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రం ట్రైలర్.. ‘కులం లేదు మతం లేదు భయం అసలే లేదు.. కానీ మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషికి.. బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు.

కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా’ వంటి డైలాగ్ తో ఎన్టీఆర్(దేవర) క్యారెక్టరైజేషన్ ని చూపించారు. పారలల్ గా విలన్ బైరా(సైఫ్ అలీ ఖాన్) (Saif Ali Khan) పాత్రని అతని గ్యాంగ్ చేస్తున్న దారుణాలను కూడా చూపించారు. ‘దేవర’ ని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ (వర) పాత్రని పరిచయం చేశారు. అతను మహా పిరికివాడు అన్నట్టు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేసింది.

మరోపక్క ‘దేవర’ (Devara)బ్రతికున్నాడా? చనిపోయాడా? బైరా గ్యాంగ్ వల్ల వర..కి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అనే సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ ‘దేవర’ మొదటి భాగం ట్రైలర్ ఉంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్స్ కి సంబంధించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి. మీరు కూడా లేట్ చేయకుండా ట్రైలర్ ను ఓ లుక్కేయండి :















