సమంత లాగే నాకు మయోసైటిస్ ఉంది!

తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత ఈ వ్యాధి గురించి బయట పెట్టడంతో ఎంతో మంది సెలబ్రిటీలు సమంత లాగే మరో నటి ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలియజేశారు.ఈ క్రమంలోనే పూనం కౌర్, కల్పికా గణేషన్ వంటి ఎంతోమంది సమంత లాంటి వ్యాధితో బాధపడుతున్నామని తెలిపారు. తాజాగా మరో నటి కూడా సమంత లాంటి వ్యాధితోనే బాధపడుతున్నానని తెలియజేస్తూ షాకింగ్ విషయాలు బయట పెట్టారు.

కోలీవుడ్ నటుడు జీవా హీరోగా నటించిన రంగం సినిమాలో నటిగా నటించిన పియా బాజ్ పాయ్ కూడా సమంత లాంటి వ్యాధితోనే బాధపడుతున్నానని తెలిపారు.సమంత లాగే తను కూడా ఈ విధమైనటువంటి వ్యాధితో బాధపడ్డానని చికిత్స లేని వ్యాధితో బాధపడే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తాను అర్థం చేసుకోగలనని తెలిపారు.నాకు మయోసైటిస్ వ్యాధి ఉందని తెలిసిన వెంటనే తాను ఇంట్లో వారికి కూడా ఈ విషయం చెప్పలేదని, ఇంట్లో వారికి తెలియకుండా ముంబైలో ఉండి ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నానని తెలిపారు.

ఈ విధమైనటువంటి వ్యాధితో పోరాడుతున్న తనకు సమంత కూడా ఇలాంటి వ్యాధితో బాధపడుతుందని తెలియగానే చాలా బాధపడ్డానని ఈమె తెలియజేశారు. ప్రస్తుతం నటి ఫియాబాజ్ పై మయోసైటిస్ వ్యాధి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus