Actress: ఆ బాధను అనుభవించి 17 ఏళ్ళు అంటున్న స్టార్ హీరోయిన్!

హీరోయిన్లు తెల్లగా.. ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు అనేది వట్టి అపోహ మాత్రమే..! బాలీవుడ్ నటి.. కాజోల్ ను ఈ విషయాన్ని ఎప్పుడో నిరూపించింది. ‘ఆర్.ఆర్.ఆర్’ నటుడు అజయ్ దేవగన్ భార్యగా కూడా ఈమె అందరికీ బాగా తెలుసు. కెరీర్ ప్రారంభంలో ఈమె చర్మం నలుపుగా ఉందని విమర్శలు చేసేవారట.ఇప్పుడు ఆమె గ్లామర్ పెరిగింది. ‘అయినా ఎలాంటి ఫెయిర్నెస్ క్రీమ్ వాడట్లేదు. స్కిన్ వైటెనింగ్ సర్జరీ కూడా చేసుకోలేదు. గతంలో 10-12 ఏళ్లు విరామం లేకుండా ఎండలో పనిచేశాను.

ఇప్పుడు సూర్యుడికి ఎక్స్పోజ్ కావట్లేదు కాబట్టే ఇలా కనిపిస్తున్నాను’ అంటూ ఆమె ఇటీవల చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ఈరోజుతో ‘ఫనా’ సినిమా రిలీజ్ అయ్యి 17 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో ఈమె ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఆమె తన పోస్ట్ ద్వారా స్పందిస్తూ.. ” ‘ఫనా’లోని ‘మేరే హాత్ మే’ పాట షూటింగ్ మొదటిరోజే పోలాండ్లో-27° Cలో మొదలైంది. గడ్డ కట్టిన సరస్సుపై పల్చని షిఫాన్ సల్వార్ కమీజ్ ధరించి నేను నానా కష్టాలు పడ్డాను.

అమీర్ అయితే షూట్ కోసమే లోకల్ మార్కెట్ కు వెళ్లి తిక్ గా ఉండే జాకెట్ తెచ్చుకున్నాడు. అందుకే గడ్డకట్టిన నా ముఖంలో ఉన్న బాధ అతని ఫేస్ లో ఉండదు. అందువల్లే ఆ పాటకు న్యాయం చేయలేకపోయా. మేము ముంబై వచ్చాక నన్ను మరింత అందంగా చూపించడం కోసం మొత్తం పాటను రీషూట్ చేశారు. నిజంగా మంచులో డ్యాన్స్ లు చేస్తూ సాహసాలు చేసే (Actress) హీరోయిన్లకు సెల్యూట్. #17YearsOfFana’ ” అంటూ కాజోల్ రాసుకొచ్చింది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus