Actress: ఆ సన్నివేశాలు అంత ఘోరంగా తీస్తారనుకోలేదు.. నటి షాకింగ్ కామెంట్స్!

ఇంటిమేట్ సీన్స్ చేయడానికి ఒకప్పుడు నటీమణులు ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఇప్పటి పోటీ ప్రపంచంలో అలాంటి సన్నివేశాల్లో నటించక తప్పడం లేదు అంటూ కొంతమంది నటీమణులు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ వెర్షన్ కోసం ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని.. గతంలో కూడా అలాంటి సన్నివేశాల్లో నటించినప్పటికీ.. ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డానని, బట్టలు లేకుండా ఉన్నప్పుడు కెమెరాకి ఎక్కువగా కనపడకుండా తన కో యాక్టర్ సాయం చేశాడని ఆమె చెప్పుకొచ్చింది.

గతంలో కూడా ఇలాంటి సన్నివేశాల గురించి చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న ఇబ్బందులు చెప్పుకొచ్చారు. తాజాగా మరో నటి కూడా ఇంటిమేట్ సన్నివేశాల్లో పాల్గొన్నప్పుడు ఎదురైన ఇబ్బందులు వివరించింది. వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ సినిమాల్లో నటించి పాపులర్ అయిన కుబ్రా సైత్.. ‘సేక్రెడ్ గేమ్స్’ అనే వెబ్ సిరీస్ కోసం ఇంటిమేట్ సీన్లనో నటించింది. ఆ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొందట. నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీతో ఆ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నపుడు అనుకోకుండా ఆమె బెడ్ పై నుండి నేలపై పడిపోయిందట.

దీంతో అనురాగ్ కశ్యప్, నవాజ్.. లు కలిసి ఎత్తుకుని (Actress) ఆమెను బెడ్ పై పడుకోబెట్టారట.ఆ సమయంలో నొప్పి భరించలేకపోయాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. తర్వాత స్కానింగ్ లు అవి తీయించుకోగా .. అందులో ఎలాంటి ఇబ్బంది లేదని తెలుసుకుని ఆమె రిలాక్స్ అయ్యిందట. ఇక ఆ ఇంటిమేట్ సీన్ కోసం ఈమె 7 టేకులు తీసుకున్నట్లు కూడా ఈ సందర్భంగా కుబ్రా సైత్ చెప్పుకొచ్చింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus