‘ఏకే’ రీమేక్.. ఆమె కూడా తప్పుకుందా..?

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఎగిరిగంతేస్తారు. కానీ ఇప్పుడు ఆయన సినిమా నుండి ఒకరికి ఇద్దరు హీరోయిన్లు తప్పుకుంటున్నారనే వార్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా తెలుగులో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్-రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇద్దరు హీరోల కోసం సాయి పల్లవి, ఐశ్వర్యా రాజేష్ లను హీరోయిన్లుగా ఎంపిక చేసుకున్నారు. అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.

అయితే సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు రెండు, మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి డేట్లు అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ కూడా తప్పుకున్నట్లు సమాచారం. తెలుగమ్మాయి అయినప్పటికీ ఐశ్వర్యా రాజేష్ కి కోలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది. అక్కడ ఆమెకి అవకాశాలకు లోటు లేదు.

ప్రస్తుతం మణిరత్నం రూపొందిస్తోన్న ‘పొన్నియన్ సెల్వన్’తో పాటు పలు ప్రాజెక్ట్ లలో ఆమె నటిస్తోంది. మొదట పవన్-రానా సినిమాకి సైన్ చేసిన ఈ భామ ఇప్పుడు డేట్లు సర్దుబాటు చేయలేకనో.. మరో కారణంతోనో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య తెలుగులో ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాను ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. ఇప్పుడు స్టార్ హీరో సినిమా ఛాన్స్ కూడా వదులుకుంది. మరి ఇక్కడ ఆమెకి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి!

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus