ప్రియుడితో ఉన్న ఫోటోను షేర్ చేసిన హీరోయిన్!

ప్రేమ, పెళ్లి ఎప్పుడు ఎవరితో ముడిపడుతుందో ఎవరు చెప్పలేరు. అలాగే ఇండస్ట్రీలో కూడా ప్రేమించుకోవడం, విడిపోవడం ఎప్పుడు, ఎలా జరుగుతుందో కూడా చెప్పలేం.. అసలు విషయం ఏమిటంటే.. అందం, టాలెంట్ రెండూ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక కొంతమంది హీరోయిన్లు కొన్ని సినిమాల్లో మాత్రమే నటించి.. ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో విమలా రామన్ కూడా ఒకరు. ఈమె స్వతహా క్లాసికల్ డాన్సర్, సినిమాల మీద ఆసక్తితో ఇండియాకు వచ్చి ఇక్కడే ఉండిపోయింది.

2009లో ఇండస్ట్రీలోకి మొదటిసారి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎలాగోలా కొన్నేళ్లపాటు బాగానే నెట్టుకొచ్చింది. హీరోయిన్ గా చేసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. ఆమె తాజాగా గాండీవధారి అర్జున, రుద్రాంగి తదితర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది విమలా రామన్. ప్రస్తుతం ఈమె వయసు 41 ఏళ్లు. అయినప్పటికీ ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు.

కానీ విలన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు వినయ్ రామ్ తో కలిసి గత కొన్నేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి దిగినటువంటి కొన్ని ఫోటోలను వారు షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (Vimala Raman) విమలా రామన్.. వినయ్ రామ్ తో కలిసి ఇన్ స్టా గ్రామ్ లో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసి..

వారి మధ్య ఉన్న రిలేషన్ షిప్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలు లేకపోయినా ఏదో ఒక విషయంలో మాత్రం విమలా రామన్ వైరల్ గా మారుతూనే ఉంటుంది. మరి ప్రియుడితో పెళ్లి విషయంపై త్వరలో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి ఈ అమ్మడు .

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus