ప్రముఖ సీనియర్ విజయ్ కుమార్ కూతురు వనితా విజయ్ కుమార్ సొంత తల్లితండ్రులే ఇంట్లో నుండి గెంటేశారని చెప్పుకొని వాపోతుంది. ‘దేవి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన వనిత.. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. గతేడాది మూడో పెళ్లితో ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన ఆమె.. సినీ పరిశ్రమ ప్రముఖుల నుండి విమర్శలు ఎదుర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది. తన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులకు ప్రధాన కారణం కుటుంబమే అని ఆరోపించింది.
ఒకటికంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం ఎవరికీ సరదా కాదని.. తన పెళ్లిళ్లు పెటాకులు కావడానికి తన తల్లితండ్రులు కూడా ఓ కారణమని చెప్పింది. జీవితం గురించి తెలియని 18 ఏళ్ల వయసులో తనకు పెళ్లి చేశారని.. తన భర్తతో ఎన్నో గొడవలు జరిగేవని చెప్పింది. చేసేదేం లేక విడాకులు తీసుకున్నానని.. అది నచ్చని తన తల్లితండ్రులు పరువు పోతుందని భావించి ఇంట్లో నుండి గెంటేశారని చెప్పుకొచ్చింది. తన ముగ్గురు పిల్లలను తీసుకొని బయటకు వచ్చేశానని.. ఎలాంటి సపోర్ట్ లేకపోవడం రోడ్డున పడ్డానని ఎమోషనల్ అయింది.
అదే సమయంలో ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని.. తనతో లైఫ్ బాగుండేదని చెప్పింది. ఈ క్రమంలో తన తండ్రి మళ్లీ ఎంటర్ అయి.. పెంపకం గురించి కేసు పెట్టడం వలన రెండో భర్త నుండి విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తల్లితండ్రులతో పాటు చెల్లెళ్లు, తమ్ముడు కూడా తనను దూరం పెట్టారని వాపోయింది. సోషల్ మీడియాలో తనను కుటుంబ సభ్యులు బ్లాక్ చేశారని తెలిపింది. జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలు వల్లే ఎన్నో విషయాలు తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది.
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!