Nani: నాని ప్యారడైజ్ డబుల్ డోస్.. బడ్జెట్ కూడా డబుల్?

న్యాచురల్ స్టార్ నాని (Nani)  , బ్లాక్‌బస్టర్ హిట్ “దసరా”ను (Dasara)  అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో (Srikanth Odela)  మరోసారి చేతులు కలపడం ఆసక్తికరంగా మారింది. నాని ఒక డైరెక్టర్‌తో వరుసగా రెండు సినిమాలు చేయడం చాలా అరుదు. ఇప్పుడు శ్రీకాంత్‌తో చేస్తున్న ఈ రెండో సినిమా “దసరా”కు మించిన అంచనాలు ఏర్పరచుకుంటోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, “ప్యారడైజ్” అనే టైటిల్‌ను యూనిట్ ఫిక్స్ చేసినట్లు ఓ క్లారిటీ వచ్చేసింది.

Nani

ఈ ప్రాజెక్ట్‌లో ఆసక్తికర విషయం ఏమిటంటే, సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేయడం. ఇది నాని కెరీర్‌లోనే తొలి రెండు భాగాల చిత్రం కావడం విశేషం. ఇటీవలి కాలంలో “బాహుబలి” “కేజీఎఫ్”  (KGF)  “పుష్ప”  (Pushpa) లాంటి సినిమాలు భాగాలుగా తెరకెక్కి విజయాన్ని సాధించిన నేపథ్యంలో “ప్యారడైజ్”కు కూడా అంతే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయనే భావిస్తున్నారు. సినిమా ప్రొడక్షన్ విషయంలోనూ భారీగా ప్లాన్ చేసినట్లు సమాచారం.

“ప్యారడైజ్” నాని కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ కోసం 150 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నట్లు టాక్. ఇక అది హిట్టయితే సెకండ్ పార్ట్ ను 200కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం. యూనిట్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి, ప్రధాన తారాగణాన్ని ఎంపిక చేయడంలో బిజీగా ఉంది. కాస్ట్, క్రూ ఎంపిక పూర్తయిన వెంటనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.

నాని-శ్రీకాంత్ కాంబినేషన్ ఇప్పటికే “దసరా”తో మాస్ ప్రేక్షకులను మెప్పించగా “ప్యారడైజ్”తో మరింత గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేయనుందని తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల ఈ సారి మరింత పవర్‌ఫుల్ కథతో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నారు. కొత్త ఏడాది ప్రారంభంలోనే సినిమా షూటింగ్ మొదలవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ ఎలా సాగుతుంది, విడుదల తర్వాత ఏ రేంజ్ హిట్ అవుతుంది అన్నది వేచి చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus