సినిమా వాళ్ళ జీవితాలు చాలా కలర్ఫుల్ గా ఉంటాయని, కెమెరా ముందు ఉన్నట్టే.. నిజజీవితంలో కూడా ఉంటారని అంతా అనుకుంటారు. కానీ వాళ్ళు మనలాగే ఉంటారు. మనకంటే ఎక్కువ టెన్షన్స్ నే మోస్తారు. కాకపోతే ఆ టెన్షన్స్ నుండి రిలీఫ్ అవ్వడానికి ఇన్స్టెంట్ గా వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి.
మనకి ఉండకపోవచ్చు..! ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. సినిమా వాళ్లకి కూడా మందు, సిగరెట్ అలవాట్లు ఉంటాయి. ఇది ఓపెన్ సీక్రెట్. ఓ స్టార్ డైరెక్టర్ కి కూడా ఆ అలవాటు ఉందట. అతను కలిగున్న ఆ అలవాటు గురించి తాను ప్రేమించిన అమ్మాయి తండ్రికి కుండబద్దలు కొట్టినట్టు చెప్పి పెద్ద షాకిచ్చాడట. అతని భార్య ఆర్తి ఈ విషయాన్ని రివీల్ చేశారు.
ఇటీవల ఆమె ఓ తమిళ మీడియా హౌస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆర్తి (Arthi) తన భర్త వెట్రిమారన్ (Vetrimaaran) గురించి అలాగే వారి లవ్ స్టోరీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఇందులో భాగంగా.. ‘ఆర్తి.. వెట్రిమారన్ (Vetrimaaran) కోసం 8 ఏళ్ళు ఎదురుచూసిందట. సినిమాల్లో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని వెట్రిమారన్.. ఆర్తికి చెప్పాడట. దీంతో అతనికి ఆమె సహకరించిందట. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక.. ఆర్తి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులకి తమ ప్రేమ గురించి చెప్పాడట.
ఇదే టైంలో తనకి సిగరెట్ అలవాటు కూడా ఉందని, ఎక్కువగా కాలుస్తూ ఉంటానని కూడా చెప్పాడట. ఇది విన్నాక ఆర్తి తండ్రి షాక్ కి గురయ్యాడట. అతని నిజాయితీ నచ్చడంతో పెళ్ళికి ఒప్పుకున్నట్టు ఆర్తి చెప్పుకొచ్చింది. వినడానికి ఇది సినిమాటిక్ గా ఉన్నా.. నిజమే..! ఆ తర్వాత వెట్రిమారన్ (Vetrimaaran) సూపర్ సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.