టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదల కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి, రవితేజ కాంబోలో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 8వ తేదీన విశాఖలో గ్రాండ్ గా జరగనుంది. అయితే ఈ సినిమాకు థియేటర్ల విషయంలో సీనియర్ స్టార్ హీరో సహాయం చేస్తున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవిపై ఉన్న అభిమానంతో ఆ స్టార్ హీరో ఈ విధంగా చేస్తున్నారని తెలుస్తోంది.
ఆ సీనియర్ హీరోకు ఏపీలో ఐదు జిల్లాల థియేటర్ల ఓనర్లతో మంచి పరిచయాలు ఉన్నాయి. చిరంజీవి సినిమాకు ఎక్కువ థియేటర్లు దక్కాలని ఆ హీరో చిరంజీవి సినిమాకు తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారని సమాచారం అందుతోంది. సంక్రాంతి సినిమాలకు థియేటర్ల విషయంలో ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. బాలయ్య సినిమాకు మంచి థియేటర్లు దక్కేలా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అడుగులు వేస్తున్నారని సమాచారం. మల్టీప్లెక్స్ లలో మాత్రం ఏ సినిమాకు ఇబ్బంది కలగకుండా అన్ని సినిమాలకు సమానంగా స్క్రీన్లను కేటాయిస్తున్నారని సమాచారం అందుతోంది.
ఇండస్ట్రీలో అందరివాడిగా పేరు తెచ్చుకున్న చిరంజీవికి ఆ గుర్తింపు వల్ల థియేటర్ల విషయంలో కూడా మేలు జరుగుతోంది. చిరంజీవి సినిమా రికార్డులు క్రియేట్ చేయాలని సంక్రాంతికి విడుదలైన సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతి సినిమాల థియేటర్ల లెక్కలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
వారసుడు సినిమా టాక్ ను బట్టి ఈ సినిమా సంక్రాంతి తెలుగు సినిమాల కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందో లేదో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. వాల్తేరు వీరయ్య మూవీ ఓవర్సీస్ లో కూడా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజవుతోంది. మాస్ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండనుందని బోగట్టా.