SSMB 29: చిరుకు నో చెప్పిన ఆయన మహేష్‌కి ఎస్‌ చెప్పాడా? నిజమేనా?

Advertisement

మహేష్‌బాబు (Mahesh Babu)  – రాజమౌళి (Rajamouli)  కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు షూటింగ్‌ ప్రారంభిస్తారు అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. అదిగో ఇదిగో అని గత కొన్ని రోజులుగా ఏదో రకంగా వార్త వచ్చి ట్రెండింగ్‌లో నిలుస్తూ ఉంది. తాజాగా మరో వార్త ఇప్పుడు చర్చలోకి వచ్చింది. ఈసారి మహేష్‌ గురించి కాదు.. మహేష్‌ను ఢీకొట్టబోయే విలన్‌ గురించి. అవును, మహేష్‌ 29వ సినిమాలో విలన్‌ ఎవరు అంటూ..

గత రెండు రోజులుగా జోరుగా చర్చ జరుగుతుంది. హీరోయిన్ల విషయంలో ఏవేవో పుకార్లు షికార్లు చేసినా హాలీవుడ్‌ హీరోయిన్‌ నటించొచ్చు అంటూ ఆ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. ఇక మిగిలిన టీమ్‌ సంగతి త్వరలో తేలుతుంది అంటున్నారు. అలా ఈ క్రమంలో విలన్‌ పాత్రధారి గురించి చర్చ వచ్చింది. అప్పుడే వరదరాజ మన్నార్‌ పేరు డిస్కషన్‌లోకి వచ్చిందంటున్నారు. ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ (Salaar)  సినిమాలో ఇప్పటివరకు ఎలాంటి విలనిజాన్ని పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రద్శించకపోయినా..

రెండో పార్టులో కావాల్సినంత విలనీ ఉంటుంది అంటున్నారు. ఆ నటుడే ఇప్పుడు మహేష్‌ బాబును ఢీ అంటే ఢీకొట్టబోతున్నాడట. అయితే ఈ విషయంలో ఎప్పటిలాగే కన్‌ఫామ్‌ చేయడం లేదు. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మరో స్టార్‌ హీరో ఉండొచ్చనే వార్త అయితే వైరల్‌గా ఉంది. ఇదిలా ఉండగా.. సినిమా కాస్టింగ్‌ డైరెక్టర్‌ విషయంలో ఇటీవల కొన్ని రూమర్స్‌ వచ్చాయి. అయితే టీమ్‌ వాటిని ఖండించింది.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏ అప్‌డేట్‌ అయినా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటిస్తుందని చెప్పింది. ఇక ఈ సినిమాకు ‘మహారాజ్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఆ పాత్రకు తగ్గట్టుగా మహేశ్‌కు ఎనిమిది లుక్స్‌ రెడీ చేశారట. వాటిలో ఒకటి ఫైనల్‌ చేస్తారని అంటున్నారు. సినిమా ప్రారంభమైన తర్వాత ప్రెస్‌ మీట్‌ పెట్టి జక్కన్న అండ్‌ కో. మరిన్ని వివరాలు వెల్లడిస్తారని టాక్‌.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus