ఆ హీరో సౌత్‌ సినిమాలతోనే బిజీ అనుకుంటే.. బాలీవుడ్‌లో రెండోది..!

సౌత్‌ దర్శకులు వరుస పెట్టి బాలీవుడ్‌కి వెళ్లే పనిలో ఉన్నారు. ‘జాట్‌’ (Jaat) సినిమాతో గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) అక్కడి హీరోకు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చారు అని అంటున్నారు. ఇదే కోవలో మరికొంతమంది దర్శకులు ముంబయి ఫ్లయిట్‌ ఎక్కే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో మరో దర్శకుడు + హీరో ముంబయి వచ్చేశాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఓ సినిమా కూడా ఓకే చేసి షాకిచ్చాడు కూడా. అతనే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) మరో హిందీ సినిమాకు ఓకే చెప్పారు.

Prithviraj Sukumaran

నటుడిగా, దర్శకుడిగా బిజీబిజీగా ఉన్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇటీవల ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ (L2: Empuraan)  సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తున్న ‘దైరా’ అనే సినిమాలోనే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించనున్నాడు. అంతేకాదు ఆయన సరసన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ నటించనున్నారు. ఈ మేరకు సినిమా టీమ్‌ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ‘సర్‌జమీన్‌’ అనే సినిమాలో కీలక పాత్ర ద్వారా బాలీవుడ్‌ సినిమాకు ఓకే చెప్పాడు.

అయితే ‘దైరా’లో ప్రధాన పాత్ర. ఈ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానా (Ayushmann Khurrana), సిద్ధార్థ్‌ మల్హోత్రా (Sidharth Malhotra) లాంటి బాలీవుడ్‌ నటులు ఈ సినిమాలో నటించనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా ఈ మేరకు వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా నటీనటుల ప్రకటనతో ఆ పుకార్లకు తాళంపడింది. స్క్రిప్ట్‌ వినగానే ఆసక్తిగా అనిపించిందని, ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే పాత్ర అనిపించిందని పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఆనందంగా చెప్పుకొచ్చాడు.

ఇక పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో ‘విలాయత్‌ బుద్ధ’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుగుతోంది. అది కాకుండా ‘నో బడీ’, ‘సంతోష్‌ ట్రోఫీ’ అనే మలయాళ సినిమాలు ఉన్నాయి. ఇది కాకుండా రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

బుచ్చిబాబు ప్లానింగ్ మామూలుగా లేదు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus