Vishwambhara: విశ్వంభర టీజర్.. అసలు మాయల వెనుక నిజం ఇదే!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’  (Vishwambhara) టీజర్‌ రిలీజైన తర్వాత ఆ సినిమాపై మిశ్రమ స్పందనలు వస్తున్న విషయం తెలిసిందే. తొలిసారి టీజర్‌ను చూసినప్పుడు ఫ్యాన్స్ ఆశించినంత మేజిక్ కనిపించకపోవడంతో కొంత నిరాశ వ్యక్తమైంది. కానీ తాజాగా బయటకు వచ్చిన ఓ నిజం మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ టీజర్‌లో ఉన్న విజువల్స్ వీఎఫ్ఎక్స్ కాదు, ఏఐ టూల్స్ ద్వారా తయారైనవని నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి స్వయంగా చెప్పారు.

Vishwambhara

వాస్తవానికి సినిమా వీఎఫ్ఎక్స్ పనులు అప్పటికి పూర్తికాలేదట. కానీ సంక్రాంతి రిలీజ్ టార్గెట్‌కు తగ్గట్లుగా హైప్ కొనసాగించాలనే ఉద్దేశంతో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి తాత్కాలికంగా టీజర్ తయారు చేశారట. వీడియో గ్రాఫిక్స్ కంపెనీలు తొలుత మూడు నెలల్లో వీఎఫ్ఎక్స్ ఇస్తామని చెప్పినా, ఆరు నెలలయినా పనులు పూర్తి కాలేదు. దీంతో ఎలాంటి ఆలస్యం లేకుండా టీజర్ ఇవ్వాలని మేకర్స్ ఏఐ టూల్స్‌ వాడారట. అయితే టీజర్ రిలీజ్ తర్వాత వచ్చిన నెగెటివ్ కామెంట్స్ చూసిన నిర్మాతలు ఇకపై పూర్తి స్థాయిలో వీఎఫ్ఎక్స్‌పైనే ఆధారపడాలని ఫిక్స్ అయ్యారు.

ఇప్పుడు ఈ వివరాలు బయటకు రావడంతో మెగా అభిమానులు కొంత రిలీఫ్ ఫీలవుతున్నారు. టీజర్‌ చూస్తే సినిమా ప్రమాణాలపై అనుమానాలు వచ్చినా, అసలు విషయం తెలిసిన తర్వాత మళ్లీ అంచనాలు పెరిగాయి. దర్శకుడు వశిష్ఠ (Mallidi Vasishta) ‘బింబిసార’ (Bimbisara)  సినిమాతో ఫ్యాంటసీకి కొత్త రూపం ఇచ్చిన విధంగా, ‘విశ్వంభర’లోనూ వైజ్ఞానికత, మైథాలజీ మిక్స్ చేసి మెగా స్కేల్‌లో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో త్రిష (Trisha), అశికా రంగనాథ్ (Ashika Ranganath), కునాల్ కపూర్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు.

ఎంఎం కీరవాణి (M. M. Keeravani)  సంగీతం అందిస్తుండటం మరో హైపే. మొత్తానికి ‘విశ్వంభర’ టీజర్‌లో ఏఐ వాడకం వల్ల వచ్చిన క్రిటిసిజాన్ని మేకర్స్ సీరియస్‌గా తీసుకొని, సినిమా ప్రమాణాల విషయంలో రాజీ పడట్లేదని చెబుతున్నారు. ఇక ఫుల్ మూవీ మాత్రం అసలైన విజువల్ ఫీస్ట్ అవుతుందని అభిమానుల నమ్మకం మరింత బలపడుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags